
వైసీపీ ఆవిర్భావదినోత్సవం రోజు వైస్ జగన్ మీద, ఆయన చుట్టూ ఉండే కోటరీ మీద ఆ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారానికి తెరలేపాయనే చెప్పాలి.
ఈ సందర్భంగా ABN ఛానెల్ నిర్వహించిన ఒక డిబేట్ లో పాల్గొన్న వైసీపీ మాజీ నాయకులు, ప్రస్తుత టీడీపీ, బీజేపీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, రవిచంద్రా రెడ్డి వైసీపీ పార్టీ విధివిధానాల మీద, ఆ పార్టీ అధినేత వైస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద చేసిన వ్యాఖ్యలు సాయి రెడ్డి ఆరోపణలను బలపరిచేలా ఉన్నాయి.
Also Read – సలహాదారులంటే వీరు కదా..
వైసీపీ పార్టీ లో ఏక్ రావణ్ అనే అధినేత చుట్టూ పాంచ్ దుష్మన్ అనే ఐదుగురు దుర్మార్గులు కోటరీ ఏర్పాటు చేసారని, ఆ కోటరీ ముందు ఆ పార్టీ అధినేత వైస్ జగన్ కూడా చాల బలహీనుడని, వారిని కాదని నిర్ణయాలు తీసుకునే సాహసం జగన్ కూడా చెయ్యలేరంటూ జగన్ బలహీనతను బయటపెట్టారు డొక్కా.
పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం శ్రమించిన సాయి రెడ్డి లాంటి నాయకులు కూడా ఆ కోటరీ గోడలను ఛేదించి జగన్ వద్దకు చేరుకోలేని పరిస్థితి వచ్చిందని, ఆ అవమాన భారం భరించలేకనే సాయి రెడ్డి పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైసీపీలో ఈ పాంచ్ దుష్మన్ చేసే రాజకీయాలలో వైస్సార్ కుటుంబ విధేయులు వివేకా, సాయి రెడ్డి కూడా బాధితులే కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.
Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!
అలాగే వైస్ రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి కూడా ఆ కోటరీలో ఉన్న పాంచ్ దుష్మన్ లను ఎదిరించిన పాపానికి గొడ్డలి వేటుకు బలయ్యారంటూ సంచలన ఆరోపణలు చేసారు. అయితే వైసీపీ అధికార ప్రతినిధిగా గత ఐదేళ్లు వైసీపీ గళం వినిపించిన రవిచంద్రా రెడ్డి కూడా తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఒక కాంక్రీట్ కుర్చీ పాతుకుపోయింది, ఆ కుర్చీని కదిపే సాహసం ఎవ్వరు చెయ్యలేరంటూ చెప్పుకొచ్చారు.
వైసీపీ హయాంలో జగన్ మీడియాను దూషించే స్క్రిప్ట్ ల నుంచి మీడియాలో వైసీపీ నేతలు మాట్లాడే బూతుల వరకు వచ్చే స్క్రిప్ట్ లన్ని కూడా ఆ పాంచ్ దుష్మన్ ఆధ్వర్యంలో నడిచే రాజకీయాలే అంటూ వైసీపీ బూతు విధానాలను బయటపెట్టారు రవిచంద్రా రెడ్డి. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం నుండి, కాకినాడ పోర్ట్ వరకు జరిగిన అవినీతి భాగోతాలన్నీ సాయిరెడ్డి నోరు విప్పితే ఇక వైసీపీ లో భూకంకంపం మొదలైనట్టే అంటూ వైసీపీ గుట్టు ఒక్కక్కొటిగా రట్టు చేస్తున్నారు
Also Read – ఏపీ ప్రోగ్రాస్ రిపోర్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అపాయింట్మెంట్ ఇస్తే వైసీపీ హయాంలో జరిగిన 50 అవినీతి స్కాముల గుట్టు విప్పుతానంటూ కూటమి ప్రభుత్వానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు రవిచంద్రా రెడ్డి. డబ్బు విషయంలో జగన్ ఒక రాక్షసుడి మాదిరి ప్రవర్తిస్తారని ఆ విషయంలో జగన్ తల్లి, చెల్లిని కూడా ఉపేక్షించరాని, దాని పరిణామాలే విజయలక్ష్మి, షర్మిల మీద కోర్ట్ కేసులు అంటూ ఉదహరించారు డొక్కా.
అయితే ఇందులో ఆ ఏక్ లీడర్…ఏక్ రావణ్…ఎవరన్నది అందరికి తెలిసినప్పటికీ ఆ మిగిలిన పాంచ్ దుష్మన్ ఎవరన్నా విషయం మాత్రం గోప్యంగానే ఉంచారు డొక్కా, రవిచంద్రా రెడ్డి. అతి తొందరలోనే ఆ ఐదుగురు ఎవరన్నది మీడియాతో పాటు సాధారణ ప్రజానీకానికి కూడా తప్పక తెలుస్తుంది అంటూ ఒక పజిల్ క్రియేట్ చేసారు ఈ మాజీ వైసీపీ నేతలు.