ఫిరాయింపులకు వ్యతిరేకం అనే పేరుతో వైకాపా వచ్చే శాసనసభ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీని బహిష్కరించినవారిపై అనర్హత వేటు పడుతుందని తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్ వర్ ప్రసాద్ హెచ్చరిస్తున్నారు.అసెంబ్లీ బహిష్కరణ రాజ్యాంగ విరుద్దమని ఆయన చెబుతున్నారు.
ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరతానని, అవసరమైతే కోర్టుకు వెళతానని ఆయన ప్రకటించడం విశేషం. వైసిపి రాజ్యాంగ వ్యవస్థలను లెక్క చేయకుండా అసెంబ్లీ బహిష్కారం చేస్తోందని ఆయన అంటున్నారు. నవంబర్ 10 నుండి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
దానికి కొంచెం ముందుగా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి నవంబర్ ఆరో తేదీ నుంచి తన 3000 కిలోమీటర్ల పాదయాత్రను ఆరంభించనున్న సంగతి తెలిసిందే. 10 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం పోగొట్టుకుంది. అసెంబ్లీ సమావేశాల్లోనే ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డికి అత్యధిక మీడియా కవరేజ్ దక్కింది. ఇప్పుడు ఆ అవకాశం పోయింది


