విజయ సాయి కాదు.. ఈడీ, సీబీఐలే ఆలోచించుకోవాలి!

vijaysai-reddy Kakinada Port Case

డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ‘సీజ్ ది షిప్’ అంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు ఏకంగా కాకినాడ పోర్టునే సీజ్ చేసి తమ ప్రతాపం చూపారు.

‘కాకినాడ పోర్టు కబ్జా’ కేసులో భారీగా మనీ లాండరింగ్ జరిగిందని అనుమానిస్తున్న ఈడీ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులకు ఇదివరకే నోటీస్ జారీ చేసింది. అయితే అప్పుడు పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటున్నందున రాలేనని విజయసాయి రెడ్డి చెప్పడంతో ఈడీ మళ్ళీ ఆయనకు నోటీస్ జారీ చేసి జనవరి 6న విచారణకు హాజరు కావాలని కోరింది. మిగిలిన వైసీపీ నిందితులకు కూడా నోటీసులు వెళ్ళాయి.

ADVERTISEMENT

కాకినాడ పోర్టు కబ్జా కేసులో ఈడీ విజయసాయి రెడ్డికి నోటీస్ పంపడం ఓ చిన్న వార్తగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే జగన్‌, విజయసాయి రెడ్డిలపై ఆక్రమాస్తుల కేసులు పెట్టిన పాపానికి దాదాపు 12 ఏళ్ళుగా సీబీఐ, ఈడీలు వారితో పోరాడుతూనే ఉన్నాయి తప్ప ఏ-1, ఏ-2లు గా ఉన్న వారిరువురినీ టచ్ చేయలేకపోయాయి. ఇంకా ఎన్ని దశాబ్ధాలు ఈ కేసు విచారణ సాగుతుందో సీబీఐ, ఈడీలకు కూడా తెలీదు. బహుశః మరో తరం అధికారులు కూడా ఈ కేసుతోనే పదవీ విరమణ చేసినా ఆశ్చర్యం లేదు.

నిజానికి ఏ కేసులలోనైనా నిందితులు న్యాయ పోరాటాలు చేస్తుంటారు. కానీ జగన్‌ విజయసాయి రెడ్డి కేసులలో మాత్రం ఈడీ, సీబీఐలే న్యాయ పోరాటాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది.

వాటిని ఇంతగా ముప్ప తిప్పలు పెడుతున్న విజయసాయి రెడ్డికి కాకినాడ పోర్టు కబ్జా కేసులో నోటీస్ పంపితే భయపడతారా?అంటే కాదనే అర్దమవుతోంది.

నిజానికి జగన్‌, విజయసాయి ప్రతాపం చూసిన తర్వాత ఈడీ అధికారులే వారిపై కొత్త కేసు నమోదు చేసేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం చాలా అవసరం.

పైగా విజయసాయి రెడ్డి తరచూ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇంకా కేంద్రమంత్రులను ఏదో ఓ సాకుతో కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టుకుంటూ, తనకు ఆ స్థాయిలో పరిచయాలు, పలుకుబడి ఉన్నాయని, కనుక తన జోలికి ఎవరూ వచ్చే సాహసం చేయవద్దని సూచిస్తూనే ఉన్నారు.

అయినా ఈడీ లేదా సీబీఐ ఒకవేళ ధైర్యం చేసి ఆయనపై కేసు నమోదు చేసినా దానికి ఎక్కడ ఏవిదంగా ఎవరిద్వారా బ్రేక్ వేయాలో, ఒకవేళ బ్రేకులు పడకపోతే ఏళ్ళ తరబడి ఆ కేసులను ఏవిదంగా నడిపించాలో విజయసాయి రెడ్డి కంటే బాగా ఎవరికి తెలుసు?

కనుక కేసులు, నోటీసులు చూసి విజయసాయి రెడ్డి భయపడటం కాదు.. ఆయనపై ఏదైనా కేసు నమోదు చేయాలంటే ఈడీ, సీబీఐలే ఆలోచించుకోవాలి.

కనుక కాకినాడ పోర్టు కబ్జా కేసు కేవలం కాలక్షేపం కోసమే.. అదో చిన్న వార్త మాత్రమే అంతకు మించి దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories