
ఢిల్లీలో రూ.300 కోట్ల మద్యం కుంభకోణం జరిగితే ఆ వార్తలతో యావత్ దేశమంతా మారుమ్రోగిపోయింది. కానీ జగన్ హయంలో అంతకు వెయ్యిరెట్లు కుంభకోణం జరిగితే ఆ వార్త ఏపీ సరిహద్దు దాటనే లేదు!
కనుకనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా దానితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్నవారు, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఇంతకాలం ఇంత ధైర్యంగా ఉన్నారు.
Also Read – కేసుల వలయంలో కేసీఆర్ కుటుంబం..!
సిఎం చంద్రబాబు నాయుడు తమపై రాజకీయ కక్షతోనే ఈ తప్పుడు కేసు సృష్టించి ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎదురు దాడులు కూడా చేస్తున్నారు.
కానీ జగన్ ముఖ్యమంత్రి కాగానే 2029 ఎన్నికల గురించి ఆలోచించి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మద్యం కుంభకోణానికి పకడ్బందీగా ప్లాన్ రెడీ చేసే బాధ్యత తనకు అప్పగించారని నమ్మిన బంటు విజయసాయి రెడ్డి స్వయంగా బయటపెట్టారు.
Also Read – కేసీఆర్ రాజకీయాలలో పాల్గొనగలరా?
అసలు మద్యం కుంభకోణానికి వారందరూ కలిసి వేసిన స్కెచ్, దానిని అంత పకడ్బందీగా అమలుచేసిన తీరు చూసినప్పుడు, జగన్ ప్రభుత్వం కూడా ఇంత చక్కగా పనిచేయలేకపోయింది కదా?అని అనిపించక మానదు.
కూటమి ప్రభుత్వం తీగ లాగితే తాడేపల్లి ప్యాలస్ కేంద్రంగా సాగిన మద్యం డొంక కదిలింది. ఆ కేసులో సిట్ అధికారులు పలువురిని విచారించారు. కొందరు ముదుర్లని అరెస్ట్ చేశారు.
Also Read – సంక్షేమ పధకాలకు ఇంత తొందర ఎందుకు?
కూటమి ప్రభుత్వం ఇలాగే ఇంకా తీగ లాగుతుంటే చివరికి తాడేపల్లి ప్యాలస్‌లోకి పోలీసులు వచ్చేస్తారని జగన్‌కి బాగా తెలుసు. అందుకే ‘నేను ఇక్కడే ఉన్నాను. అరెస్ట్ చేసుకోవచ్చని’ చెప్పేశారు కూడా.
కానీ అంత మాత్రాన్న జగన్ చేతులు ముడుచుకొని కూర్చోరు కదా?అందుకే వైసీపీ నేతలని సిఎం చంద్రబాబు నాయుడుపైకి ఉసి గొల్పారు.
అయితే ఈ కేసులో తమ అధినేత జగన్ కడిగిన ముత్యమని నమ్మడం వలననే వారందరూ సిఎం చంద్రబాబు నాయుడుపై ఎదురు దాడులు చేస్తున్నారని అనుకోలేము.
ఒకవేళ ఈ కేసులో జగన్ జైలుకి వెళితే తమ రాజకీయ భవిష్యత్ ఆగమ్యగోచరం మారుతుందనే భయాందోళనలతోనే వారు ఈ విమర్శలు, వితండవాదం చేస్తున్నారని చెప్పవచ్చు.
ఇటీవల జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మద్యం కుంభకోణంపై చంద్రబాబు నాయుడుని కడిగేశారని, జగన్ అడిగిన ప్రశ్నలకు ఆయనతో సహా టీడీపీలో ఎవరూ జవాబులు చెప్పలేకపోయారని, వైసీపీ నేతలందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు. మంచిదే.
ఈ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అన్నీ రాజ్ కసిరెడ్డి అని విజయసాయి రెడ్డి ముందే చెప్పేశారు. కనుక ఈడీ అధికారులు నేడు విజయవాడ చేరుకొని జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
ప్రెస్‌మీట్ పెట్టుకునే వెసులుబాటు, జగన్, వైసీపీ నేతలు చేసే వితండవాదనలు అచ్చేసి, తిమ్మిని బమ్మి చేయగల సొంత మీడియా చేతిలో ఉంది కనుక ఇంతకాలం సాగింది.
ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. చంద్రబాబు నాయుడు ఈ మద్యం కుంభకోణం సృష్టించారని వాదిస్తున్న జగన్, వైసీపీ నేతలు ఇప్పుడు ఈడీ ఎందుకు వచ్చిందో చెప్పగలరా?చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్న వారు ఒకవేళ ఈడీ జగన్‌కు నోటీస్ జారీ చేసి విచారణకు పిలిస్తే, అరెస్ట్ చేసి ఢిల్లీ పట్టుకుపోతే అప్పుడు ఈడీని, మోడీని విమర్శించగలరా?ఇలాగే వితండవాదం చేయగలరా? ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరిని నిందిస్తారు?