Even in Opposition, Jagan Hurting Andhra Pradesh!

సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు, సంక్షేమ పధకాల అమలు గురించి ఆలోచిస్తూ ఆ దిశలో ముందుకు సాగుతుంటే, వైసీపీ అధినేత జగన్‌ ఎంతసేపు కేసులు, పరామర్శ యాత్రలు, తన భద్రత గురించే ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లు పార్టీ నేతల చేత కూడా వాటి గురించే మాట్లాడిస్తున్నారు.

రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, జగన్‌ 5 ఏళ్ళ విధ్వంస పాలనలో ఇంకా నష్టపోయింది. కనుక చాలా వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగితే తప్ప ఈ సమస్యలలో నుంచి రాష్ట్రం బయటపడలేదు.

Also Read – ఆ రెండు పార్టీలు గోదావరికి బిందెలు అడ్డం పెట్టొచ్చుగా?

ఉదాహరణకు కేసీఆర్‌ చేసిన అప్పుల కారణంగా తెలంగాణ ఆర్ధిక పరిస్థితి దెబ్బతిందని, ఆ కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని ఆ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి పదేపదే చెపుతున్నారు.

ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని మొదలుపెట్టలేదని బిఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుండటం గమనిస్తే సిఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అని అర్దమవుతోంది.

Also Read – కన్నీటికి ‘కోటా’ లేదు…

అయితే జగన్‌ ఆర్ధిక విధ్వంసం వలన ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి తెలంగాణ కంటే ఇంకా దయనీయంగా ఉంది. కనుక రాష్ట్రానికి సంబందించినంత వరకు ప్రతీ రోజూ చాలా అమూల్యమైనదే.

కనుకనే సిఎం చంద్రబాబు నాయుడు కాలాన్ని సద్వినియోగం చేసుకొంటూ, కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు వినియోగించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Also Read – పేర్ని అత్యుత్సహం: అరవడానికా.? కరవడానికా.?

జగన్‌ అరాచక పాలన చూసిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు వారితో ముఖాముఖి మాట్లాడి వారిలో ‘జగన్‌ ఫోబియా’ పోగొట్టి రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించి తీసుకువస్తున్నారు.

మరో పక్క జగన్‌ ముఖ్యమంత్రిగా చేసిన విధ్వంసం చాలదన్నట్లు, ప్రజల చేత తిరస్కరించబడినా నేటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నష్టం కలిగిస్తూనే ఉన్నారు. తన మాటలతో, వైసీపీ చేతలతో, వారి మీడియా రాతలతో ఆంధ్రప్రదేశ్‌ అంటే అందరూ భయపడేలా చేస్తున్నారు.

ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినా జగన్‌ తన సమర్దత నిరూపించుకోలేకపోయారు. సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచడమే సుపరిపాలన అనుకున్నారు. నేటికీ అదే భ్రమలో ఉన్నారు.

ఆయన ఆ భ్రమలో ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్రానికి నష్టం కలిగించాలనుకోవడం, రాష్ట్ర ప్రతిష్ట మంట గలపాలనుకోవడం చాలా దుర్మార్గమే కదా?

వైసీపీ నేతలందరూ కూడా జగన్ బాటలోనే గుడ్డిగా సాగుతున్నారు తప్ప తమ రాజకీయాల వలన రాష్ట్రానికి నష్టం కలుగుతోందని తెలిసి ఉన్నా పట్టించుకోవడం లేదు.




ఇలా వ్యవహరిస్తుంటే మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?ఇలా వ్యవహరిస్తే ప్రజలు మనకి మళ్ళీ అవకాశం ఎందుకు ఇస్తారు? అని వైసీపీలో ఎవరూ ఆలోచించినట్లు లేదు. ఎందుకంటే, వైసీపీలో అందరి తరపున జగన్‌ ఒక్కరే ఆలోచిస్తారు.. ఆయన ఏం చేసినా ఎలా చేసినా అదే కరెక్ట్ అని వైసీపీ నేతలు అనుకుంటారు కనుక!