త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కుతోన్న “అజ్ఞాతవాసి” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అతిధి పాత్ర పోషించబోతున్నారా? అబ్బే అదేం లేదు గానీ, ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన ఈ సినిమా ఆన్ సెట్ ఫోటోలలో ఒక దానిని ఎడిట్ చేసి ఈ విధంగా సృష్టించగా, అది కాస్త వైరల్ అవుతూ ఇరువురు హీరోల అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసి, శుభాశీస్సులు అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలుసుకున్న పవన్ – ఎన్టీఆర్ ల ఫోటోలు అభిమానులను ఓ రేంజ్ లో అలరించాయి. అవి నిజమైన ఫోటోలు కాగా, ఈ ఫోటో మాత్రం పవన్ కారులో కూర్చుని ఉన్న స్టిల్ ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఫేక్ పిక్ అయినా రెస్పాన్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వస్తోంది. మరి మల్టీస్టారర్ మహిమ అలాంటిది. ఇలాంటి హీరోల మల్టీస్టారర్ సినిమాల కోసమే తెలుగు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నది. అయితే అది సాధ్యం కాదని వారికి కూడా తెలుసు గనుకే… ఇలాంటి ఫోటోలతోనే సంబర పడిపోతుంటారు.



