
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పధకం కింద మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పుడు ఏపీలో మహిళలలు కూడా ఆ పధకం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర రవాణా, క్రీడల శాఖల మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి ఆదివారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఒక నెల రోజులలోగానే రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తాము. ఇప్పటికే ఈ పధకాన్ని అమలుచేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో అధికారులు పర్యటించి దీనిలో ఉన్న సాదకబాధకాలను తెలుసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా ఏపీలో కూడా ఈ పధకాన్ని అమలు చేస్తాము.
Also Read – దెబ్బలు పడతాయ్ రాజా..
క్రీడల శాఖా మంత్రిగా రాష్ట్రంలో క్రీడాకారులకు అన్ని విదాలుగా తోడ్పడతాను. రాష్ట్రంలో క్రీడా రంగం పరిస్థితి ఏవిదంగా తెలుసుకొని లోటుపాట్లు గుర్తించి మళ్ళీ పూర్వవైభవం సాధించేందుకు గట్టిగా కృషి చేస్తాను,” అని చెప్పారు.
మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం చాలా మంచి ఆలోచనే కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ పధకాన్ని అమలుచేసినప్పటి నుంచి టిజిఎస్‌ఆర్టీసీ ఆదాయం సుమారు 30% పడిపోవడంతో ఆ సంస్థ ఆ మేరకు నష్టపోతోంది.
Also Read – శాసనసభ సమావేశాలు: జగన్ స్టోరీ మామూలే!
కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పులలో మునిగిపోయి ఉన్నందున, ఇంకా అనేక హామీలు అమలుచేస్తుండటం వలన టిజిఎస్‌ఆర్టీసీకి కలుగుతున్న ఆ నష్టాన్ని సకాలంలో భర్తీ చేయలేకపోతోంది. దీంతో టిజిఎస్‌ఆర్టీసీ నష్టాలు క్రమంగా పెరుగుతున్నాయి.
కనుక ఏపీ ప్రభుత్వం కొన్ని పరిమితులతో ఈ హామీని అమలు చేస్తే మంచిది. లేకుంటే ఇప్పటికే దయనీయ స్థితిలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి మరింత దయనీయంగా మరే ప్రమాదం ఉంటుంది.
Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!
జగన్ పాలనలో రవాణాశాఖ భ్రష్టు పట్టిపోయింది. రవాణా, ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారంలో ఉన్న టిడిపి నేతలను వేధించడానికే ఆ శాఖని జగన్ ఎక్కువగా ఉపయోగించుకున్నారు.
ఓ చేత్తో బటన్ నొక్కి ‘వాహన మిత్ర’తో ఆటో డ్రైవర్ల చేతిలో కొంత డబ్బు పెడుతూ, ట్రాఫిక్ పోలీసులతో చలాన్లు వేయించి ఆ సొమ్ముని వెనక్కు తీసుకునేవారు.
జగన్ పాలనలో ప్రైవేట్ ట్రావెల్స్, సరుకు రవాణా లారీ యజమానులను వేధించి, పీడించి పిప్పిచేయడంతో, వారి పరిస్థితి చాలా దయనీయంగానే ఉంది. కనుక తమపై ఈ భారాన్ని తగ్గించవలసిందిగా వారు వేడుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రతిపక్షాలతో వికృత రాజకీయ క్రీడలు బాగానే ఆడింది. కానీ అసలైన క్రీడా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేసింది.
ఒకప్పుడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎంతోమంది గొప్పగొప్ప ప్లేయర్స్‌ని దేశానికి అందించింది. కానీ 5 ఏళ్ళుగా ఆ అసోసియేషన్‌లో, స్టేడియంలలో రాజకీయాలు తప్ప మరొకటి కనబడటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం క్రీడల శాఖని వైసీపి నేతలకు రాజకీయ ఆవాస కేంద్రంగా మార్చేసింది.
‘ఆడుదాం ఆంద్రా’ పేరుతో జగన్ ప్రభుత్వం వందల కోట్లు వృధా చేసింది తప్ప దాని వలన క్రీడా రంగానికి ఒరిగిందేమీ లేదు. కనుక మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్రీడా రంగాన్ని మళ్ళీ పునాది స్థాయి నుంచి సరిచేసుకు రావలసి ఉంటుంది.
జగన్, మంత్రులు తమ ప్రభుత్వం అన్ని రంగాలను ఎంతగానో అభివృద్ధి చేసిందని గొప్పలు చెప్పుకునేవారు కానీ ఇలా ఏ రంగాన్ని చూసినా అది భ్రష్టు పట్టిపోయే కనిపిస్తోంది. కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కంటే ముందు, జగన్ భ్రష్టు పాటించేసిన అన్ని శాఖలను చక్కదిద్దుకుంటే తప్ప అడుగు ముందుకు వేయడం కష్టమే.