బంగారానికి మసి పట్టిందా?

gold-selling-black-market-rates-notes-ban-resultప్రధాని మోడీ నిర్ణయం తో పేద, మధ్య తరగతి ప్రజలు బ్యాoకుల దగ్గర క్యూ కట్టగా బడాబాబులు మాత్రం బంగారం షాపుల దగ్గర క్యూ కట్టారు. మన నల్ల కుభేరురుల బుర్ర మాత్రం పాదరసంలా పనిచేస్తుందనే చెప్పాలి.నల్ల ధనంతో బంగారం కొన్ని నల్ల ధనాన్ని తెలుపు చేసుకొని పసిడి రంగుని మార్చేసారు ఈ మేధావులు. నగదు షాపులవారు మాత్రం ఈ నల్ల కుభేరుల పాలిట ఆపద్బాంధవుడుగా మారిపోయారు.

మార్కెట్లో గ్రాము బంగారం ధర ౩౩౦౦ ఉండగా ఈ నల్ల ధనంతో బంగారం కొనాలంటే మాత్రం గ్రాముకి 55౦౦ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అయినా బడాబాబులకు కావాల్సింది కూడా ఇదే. వారి దగ్గరున్న నల్లధనం ఎంత మేర పసిడి రంగులోకి మారిస్తే వారికి అంత తెలుపు రంగు అంటుకొంటుంది. కాక పొతే ఈ విషయంలో వీరు కొంత మేర విజయ సాధించినట్లే కాని వారిని కాపాడే క్రమంలో సమిధులైంది మాత్రం పసిడి దుకాణదారులే.

ADVERTISEMENT

పసిడి షాపుల మీద నిన్న,ఈ రోజు ఐ.టి శాఖ వారి దాడులతో దుకాణాదారులు హడలి పోతున్నారు. ఇప్పుడు వీరికి అంటిన నలుపు వీరు ఎవరికీన్నా పుస్తారో చూడాలి మరి. మళ్ళి ఎ వస్తువు రంగు ఎలామారుతుందో అని సామన్య ప్రజానీకం ఆసక్తిగా చూస్తున్నారు.మన నల్లకుభేరులు తలచుకొంటే ఎంతటి విలువైన వస్తువుకైనా మసి పట్టించగలరు అని మళ్ళి నిరూపించారు.

ADVERTISEMENT
Latest Stories