కేసీఆర్ ప్రభుత్వానికి మోడి తీపి కబురు!

Good news from narendra modi to telanganaకేసీఆర్ ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పాతదేనని కేంద్రం స్పష్టం చేసింది. పునరాకృతిలో భాగంగా ప్రాణహిత-చేవెళ్లను విభజించి చేపట్టిందిగానే గుర్తిస్తున్నట్లు పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కొత్తదని, గోదావరి నదీ యాజమాన్యబోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం అవసరమని ఆంధ్రప్రదేశ్‌ కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ వాదించింది.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌ చెబుతున్నట్లుగా ఇది కొత్తది కాదని, పునరాకృతిలో భాగంగా ప్రాణహిత-చేవేళ్లను విభజించి చేపట్టిందేనని తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన వివరణతో జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి అభిప్రాయపడ్డారు. టి లభ్యతకు సంబంధించి కేంద్ర జలసంఘంలోని హైడ్రాలజీ విభాగం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇస్తే ఇంకా ఈ ప్రాజెక్ట్‌కు అన్ని అడ్డంకులు ముగిసిపోయినట్టే.

ఈ ప్రాజెక్టుకు దాదాపు 80000 కోట్లు ఖర్చు చెయ్యనుంది. దేశంలోనే ఒక ప్రాజెక్ట్‌కు ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అత్యధిక ఖర్చు ఇది. ఒక్కసారి ప్రోజెక్ట్‌కు నిర్మాణం పూర్తి అయ్యాక కేవలం ప్రాజెక్టు నిర్వహణకు అయ్యే విద్యుత్ ఖర్చే ప్రతి సంవత్సరం 8677 కోట్లు ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories