ఆ ఒక్కడి కోసమే ఏదైనా అవుతా..!

gopichand-prabhas

2001 తొలివలపు సినిమాతో హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన గోపీచంద్ 2002 లో వచ్చిన జయం సినిమాలో విలన్ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత వరుసగా మహేష్ బాబు నిజం సినిమాలో, ప్రభాస్ వర్షం మూవీ లో విలన్ గా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

అయితే ఆ తరువాత వచ్చిన యజ్ఞం, ఆంధ్రుడు,రణం, లక్ష్యం, సౌర్యం మూవీలతో గోపీచంద్ హీరోగా స్థిరపడ్డారు. గత కొంతకాలంగా గోపీచంద్ మూవీలు బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి. థియేటర్లలోకి ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళుతున్నాయో కూడా సగటు సినిమా అభిమానికి తెలియనంతగా గోపీచంద్ సినీ కెరియర్ నడుస్తుంది.

ADVERTISEMENT

తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరో గోపీచంద్. అయితే ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ గోపీచంద్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

తానూ ప్రతినాయకుడిగా చేసిన పాత్రలు సినీ ప్రేక్షకుల మనస్సుల్లో చాల బలమైన ముద్రవేశాయని, తనను తిరిగి మళ్ళీ అటువంటి పాత్రలలో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చుపిస్తారన్న విషయం తన చెవిన పడిందని అన్నారు. అయితే తానూ ఆ విలన్ పాత్రలు చెయ్యాలంటే మాత్రం ఆ ఒక్క హీరోతోనే చేస్తానంటూ తన మనస్సులో మాట బయటపెట్టారు.

తనకు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆప్తుడు, ప్రాణ స్నేహితుడి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో తానూ ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించాలని ఆశపడుతున్నారు తెలియచేసారు. వర్షం మూవీలో హీరో ప్రభాస్ కు ధీటుగా విలన్ పాత్రలో గోపీచంద్ నటన అందరిని ఆకట్టుకుంది.

వీరిద్దరి కాంభినేషన్ లో వచ్చే సీన్లు థియేటర్లలో విజిల్స్ వేసేలా చేసాయి. అయితే గోపీచంద్ ఇచ్చిన ఈ ఆఫర్ ను దర్శకులు గుర్తించి ప్రభాస్ కు ప్రతినాయకుడిగా గోపీచంద్ కు అవకాశం కల్పిస్తే దాదాపు రెండు దశబ్దాల తరువాత వీరి కాంబో మళ్ళీ వెండితెర మీద ఆవిష్కరించబడుతుంది.

ADVERTISEMENT
Latest Stories