వైకాపాలో పాదయాత్రల జోరు!

Gopireddy srinivasa reddy padayatraప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి నవంబర్ ఆరో తేదీ నుంచి తన 3000 కిలోమీటర్ల పాదయాత్రను ఆరంభించనున్న సంగతి తెలిసిందే. దానికి సంఘీభావంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే నరసరాపుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాదయాత్ర చేపట్టారు.

ADVERTISEMENT

జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 30న తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట నుంచి తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆల యం వరకు పాదయాత్ర చేస్తారు.

చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొంటారు. వివిధ దేవాలయాలలో పూజలు కూడా చేస్తున్నారు. మరోవైపు పాదయాత్ర ముందుగా జగన్ లండన్ వెళ్లనున్నారు. వచ్చినవెంటనే తిరుమల వెళ్ళి స్వామి వారిని దర్శించుకుని నవంబర్ 6న పాదయాత్ర స్టార్ట్ చేస్తారు.

ADVERTISEMENT
Latest Stories