త్వరలో 6 నెలలో అవినీతి అధికారుల అక్రమాస్తులను ప్రభుత్వపరం

 disproportionate assetsఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక న్యాయస్థానాల చట్టం అమల్లోకి రావడంతో అవినీతి అధికారుల అక్రమాస్తులను ప్రభుత్వపరం చేసే ప్రక్రియను ఏసీబీ ప్రారంభించింది. ఇందులో భాగంగా అత్యంత సంచలనం కలిగించిన 13 కేసుల వివరాలతో ప్రాథమిక జాబితాను సిద్ధం చేసింది. అక్రమాస్తుల స్వాధీనం కోసం నియమితులైన అధీకృత అధికారి నిపుణుల సాయంతో నిందితుడి ఆస్తుల విలువ లెక్కిస్తారు.

అతనిపైన పేర్కొన్న అభియోగాలపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేస్తారు. ఆస్తులన్నీ సక్రమార్జనేనని నిరూపించే ఆధారాలు సమర్పించడానికి 30 రోజుల గడువు ఇస్తారు. సహేతుక కారణాలున్నాయని భావిస్తే ఈ గడువు మరో 15 రోజులు పొడిగించొచ్చు. ఇరువైపులా వాదనలు విని ప్రత్యేక న్యాయస్థానం ఆరు నెలల్లోగా ఆ కేసుకు సంబంధించి తుది తీర్పు వెల్లడిస్తుంది.

ADVERTISEMENT

తుది తీర్పు తర్వాత నిందితుడికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తులను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ కేసు దర్యాప్తులో ఉంటున్నందున నిందితులే ఆ ఆస్తులను అనుభవిస్తున్నారు. కేవలం క్రయవిక్రయాలు మాత్రమే సాధ్యపడటం లేదు. ఇప్పుడు మాత్రం విచారణ తేలేంతవరకూ వాటిని ప్రభుత్వం ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం వినియోగించుకోనుంది. ఒకవేళ నిందితులు కేసు నుండి బయటపడితే ఆ ఆస్తిపై వచ్చిన ఆదాయానికి 5 శాతం వడ్డీ కలిపి ప్రభుత్వం చెల్లిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories