
గతేడాది ఐపీఎల్ లో మరువలేని సంఘటనలేంటి అంటే, ఆర్.సి.బీ అభిమానులు వారు చివరిగా ఆడిన చెన్నై మ్యాచ్ అని సమాధానమిస్తారు, హైదరాబాద్ అభిమానులు తమ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన అని బదులిస్తారు, కోల్కతా అభిమానులు తమ జట్టు కప్పును గెలవటమని చెబుతారు, కానీ, సగటు భారత క్రికెట్ అభిమాని మాత్రం ‘పాండ్య కు జరిగిన అవమానం’ అని సెలవిస్తాడు.
2023 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ లో ఓటమి చెందిన కొన్ని రోజులకే ముంబై జట్టు పాండ్య ను తిరిగి తమ జట్టులోకి తీసుకుని , తీసుకున్న కొన్ని రోజులకే కెప్టెన్ గా కూడా ప్రకటించారు. అయితే, ఈ వార్త ను దాదాపు ప్రతి ముంబై అభిమాని, మరియు భారత అభిమాని కూడా జీర్ణించుకోలేకపోయారు. రోహిత్ లాంటి ఒక అరుదైన సారధి ని, ముంబై జట్టుకి 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన సారధి నుండి కెప్టెన్సీ పగ్గాలను ఆ రకం గా తొలగిస్తారని ఎవ్వరు ఊహించలేకపోయారు.
Also Read – నేను భారతీయురాలినే అంటున్న ప్రభాస్ హీరోయిన్.
అందునా అది ముంబై జట్టు రోహిత్ కు చేసిన ఘోర అవమానంగాను భావించారు. దానికి ప్రతిగా చాలామంది ముంబై ఇండియన్ ఫాన్స్ ఆ జట్టుకి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఇక ఆ ప్రభావం ఐపీఎల్ 2024 లో హార్దిక్ పాండ్య పై పడింది. ముంబై వేదికగా ఆడిన ప్రతి మ్యాచ్ లో ను హార్దిక్ టాస్ కోసం మైదానం లోకి అడుగు పెట్టగానే అక్కడి అభిమానులంతా హార్దిక్ ను గేలి చేస్తూ ‘బూ..బూ’ అంటూ తనకు మానసిక ఒత్తిడి ని కలిగించారు.
ముఖ్యంగా ఇందువల్ల జట్టు లో ఐక్యత లేమి స్పష్టంగా కనిపించింది. అబ్బుర పరిచే ఆటగాళ్ళెందరో ఉన్నా, ఉపయోగేమీ లేకుండా పోయింది. హార్దిక్, రోహిత్, సూర్య, బుమ్రా, తిలక్ వంటి అద్భుతమైన టీం ఇండియా సభ్యులు ఉన్నప్పటికీ ముంబై జట్టు కనీసం నాకు-ఔట్స్ గడప తొక్కటం కాదు కదా, పాయింట్ల పట్టిక లో ఏకంగా 10 వ స్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది.
Also Read – వైసీపీ నేతల కేసులు.. ఎక్స్ఎల్ షీట్ పెట్టాలేమో?
అయితే ఈ వైఫల్యమంతా కెప్టెన్ గా పాండ్య పైనే పడింది. కానీ, ఇది జరిగిన నెల రోజుల గడువు లోనే ఐసీసీ టి-20 వరల్డ్ కప్ గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించి, అవమానపడ్డ అదే మైదానం లో ఏకంగా రోహిత్ – విరాట్ వంటి వారి చేత శభాష్ అనిపించుకున్నాడు పాండ్య.
ఇక, ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ లో సైతం జట్టుకు చేదోడు-వాదోడు గా ఉంటూ, గెలుపు లో ముఖ్యమైన పాత్ర పోషించి మరోమారు క్రికెట్ అభిమానుల మనసు గెలిచారు హార్దిక్. ఐపీఎల్ 2024 ఘోర అవమానం తరువాత జరిగిన రెండు మెగా టోర్నీలలోను పాండ్య తన పవర్ ఏంటో చూపించాడు, కనుక ఇక ఈ 2025 ఐపీఎల్ లో కూడా ముంబై జట్టుకి సారధి గా వ్యవహరిస్తున్న పాండ్య కు ముంబై అభిమానుల నుండి పూర్తి మద్దతు దక్కుతుందా.? లేదా అనేది చూడాలి.