బనకచర్ల ప్రాజెక్టు పేరుతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నీళ్ళ రాజకీయాలు చేయడం మొదలుపెట్టగానే, ఆ ఒత్తిడికి తలొగ్గి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాలు చేయక తప్పలేదు.
అయితే బనకచర్ల పేరుతో నీళ్ళ రాజకీయాలు చేసిన హరీష్ రావు ఈరోజు మాట్లాడిన మాటలు వింటే వాస్తవ పరిస్థితి అర్దమవుతుంది.
హరీష్ రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఈ క్షణంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 73,600 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు నీటి మట్టం 96 మీటర్లుంది. అది 93.5 మీటర్లున్నప్పుడే కన్నెపల్లి పంప్ హౌసులో మోటర్లు ఆన్ చేసి రోజుకి రెండు టీఎంసీలు తోడుకొని అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో నింపుకోవచ్చు. కానీ దాదాపు 20-30 రోజులుగా గోదావరి నీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ గుండా పారుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఎదురుగా 73,600 క్యూసెక్కులు గోదావరి నీళ్ళున్నాయి. పక్కనే కన్నెపల్లి పంప్ హౌసులో 11 భారీ పంపులున్నాయి. కరెంటుంది. అయినా మోటర్లు ఆన్ చేసి నీళ్ళు ఎందుకు తోడిపోయడం లేదు?
పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కృష్ణానది నీళ్ళని కూడా వాడుకోకుండా దిగువకు వదిలేస్తున్నారు. కేసీఆర్ మీద అసూయ ద్వేషంతోనే ఆయన కట్టిన ప్రాజెక్టులను పాడుబెడుతూ, నీళ్ళని వదిలేస్తున్నారు,” అని హరీష్ రావు ఆరోపించారు.
అంటే తెలంగాణలో నీళ్ళకు కరువు లేదని, కానీ రాజకీయ ద్వేషాలతోనో, ప్రాజెక్టులలో లోపాల కారణంగానో కృష్ణా, గోదావరి నీళ్ళను వాడుకోలేక సముద్రం పాలు చేస్తున్నారని స్పష్టమవుతోంది. బనకచర్లని తీవ్రంగా వ్యతిరేకించిన హరీష్ రావే ఈ మాట చెప్పారు.
అలా సముద్రం పాలవుతున్న నీటిని సిఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలించి వాడుకోవాలనుకుంటే హరీష్ రావే సైంధవుడిలా అడ్డుపడ్డారు.
దేనికంటే కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న ఆధిపత్యపోరులో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈవిదంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు వేర్వేరు రాజకీయ కారణాలతో పోరాడుకుంటూ దానికి బనకచర్లని బలి చేశాయి.
కృష్ణా, గోదావరి తెలంగాణలో పొంగి ప్రవహిస్తునప్పుడే వాడుకోలేకపోతున్నప్పుడు, సముద్రంలో కలిసిపోతున్న నీళ్ళ కోసం ఇంత నీచ రాజకీయాలు చేయడం అవసరమా?
తక్షణమే కాళేశ్వరం పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లను ఎత్తి పోయాలి.
పంప్ హౌస్ లు ఉన్నాయి. సబ్ స్టేషన్లు ఉన్నాయి. రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్లు ఎత్తి పోయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?
లేకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి… pic.twitter.com/h3Y9xT6wR7
— BRS Party (@BRSparty) July 6, 2025




