పవన్ కాదు… కానీ ఆమరణ నిరాహార దీక్ష ఆన్ కార్డ్స్..?

hero-sivaji-will-start-amarana-nirahara-deekshaఆంధ్రప్రదేశ్ కు ‘స్పెషల్ స్టేటస్’ను మంజూరు చేయాలంటే… ఎవరో ఒకరు ఆమరణ నిరాహార దీక్షకు దిగితే తప్ప సాధ్యం కాదా? గతంలో తెలంగాణా కల ఇదే విధంగా సాకారం కావడంతో, ఏపీకి కూడా మరో ప్రత్యామ్నాయం లేదని, ఆమరణ నిరాహార దీక్షే శరణ్యం అన్న మాటలు ప్రజల్లో కూడా బలంగా వినపడుతున్నాయి. అయితే దానిని చేసే వారెవరు? ప్రధాన నాయకులు ఎవరూ ముందుకు రారు గనుక, ఆమరణ నిరాహార దీక్ష తాను చేపడతాను అంటున్నారు హీరో శివాజీ.

ADVERTISEMENT

ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్న శివాజీ ఈ దిశగా ప్రతిజ్ఞ చేసారు. ఈ పార్లమెంట్ సమావేశాల లోపున ఏపీకి ప్రత్యేక హోదాను మంజూరు చేయని పక్షంలో ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్షను చేపడతానని తాజాగా శివాజీ ప్రకటన చేసారు. ఏపీ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేసారని అన్న శివాజీ, భవిష్యత్తులో నమ్మకద్రోహం చేసిన వారిని ‘నువ్వు మనిషివా? మోడీవా?’ అని ప్రశ్నించే రోజు వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో వెంకయ్య నాయుడు అన్యాయం చేస్తారన్న అంశాన్ని తాము ముందుగానే చంద్రబాబుకు తెలిపామని, ఏపీ కోసం ఎవరు పోరాటం చేసినా, లేకున్నా… తమ పోరాటం మాత్రం ఆగదని, భావితరాల కోసం ఖచ్చితంగా పాటు పడతామని అన్న శివాజీ, బిజెపికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పన్నుల రూపేణా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్న నిధులు ఆయా రాష్ట్రాల నిష్పత్తి ప్రకారం, వారికే ఖర్చు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories