2018 చివరికల్లా మెట్రో రైలు పూర్తి స్థాయిలో

Hyderabad-Metro-Hourly-Charge-on-Telugu-Films-Shoot2018 చివరికల్లా హైదరాబాద్ మెట్రో రైలు పాతబస్తీ మినహా అన్ని చోట్ల పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తుందని మెట్రో ఎం.డి. ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ 16 కి.మీ, అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ 8.5 కిమీ మార్గంలో మెట్రో పనులను శరవేగంగా పూర్తి చేసి జూన్‌ కల్లా మెట్రో రైళ్లను నడుపుతామని ఆయన చెప్పారు.

యూసు్‌ఫగూడ, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఆస్తుల సేకరణలో ఇబ్బందులు ఉన్న జూన్ నాటికి ఆ రెండు రూట్లు అందుబాటులోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. మొత్తం ప్రాజెక్టును 2018 నవంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. పాతబస్తీ సాధ్యాసాధ్యాలు సీఎం పరీశీలిస్తున్నారని ఆయన చెప్పిన అది జరగడం కష్టమే అని అధికారులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు.

ADVERTISEMENT

ప్రస్తుతం 30కి.మీ మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మియాపూర్‌ నుంచి అమీర్‌పేటకు 8 నిమిషాలు, అమీర్‌పేట నుంచి నాగోల్‌కు ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు నడుస్తోంది. మార్చి తర్వాత అవసరం అనుకుంటే రైళ్ల ఫ్రీక్వెన్సీని అవసరమైతే 5,3,2 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపేందుకు సిస్టిం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు

ADVERTISEMENT
Latest Stories