
జగన్, కేసీఆర్ ఇద్దరూ కూడా తాము అత్యుత్తమైన పాలన అందించామని బల్లగుద్ది వాదించేవారు. కానీ ప్రజలు వారిని తిరస్కరించారు… అదీ చాలా దారుణంగా! అంటే వారి వాదనలను ప్రజలు తిరస్కరించారన్న మాట!
కానీ నేటికీ వైసీపీ, బిఆర్ఎస్ పార్టీల నేతలు తాము చేసిందే పాలన.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ రాష్ట్రాలను భ్రష్టు పట్టించేస్తున్నారని మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు. ఇద్దరిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.
Also Read – చిలుకూరు పరామర్శ పోటీలు… అందుకేనా?
రాజకీయాలలో ఇది చాలా సహజమే. అయితే రాష్ట్రాలకు మేలు జరుగుతున్నా రెండు పార్టీల నేతలు అది చూసి ఓర్వలేకపోతుండటం, ఒకేలా మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళపాటు కేసీఆర్ పాలించారు. అదే సమయంలో ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఎంపీగా కూడా ఉండేవారు. కానీ నిజామాబాద్ జిల్లాకు ‘పసుపు బోర్డు’ సాధించడంలో విఫలమయ్యారు… అని అనేకంటే మోడీతో కయ్యమాడుతూ రాకుండా చేసుకున్నారని చెప్పొచ్చు.
Also Read – అయితే రోజా కూడా జంప్?షర్మిలకి జై?
కానీ నిజామాబాద్ బీజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పట్టుదలగా ప్రయత్నించి పసుపు బోర్డు సాధించుకున్నారు.
కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటుని స్వాగతిస్తున్నామని అంటూనే, రాజకీయ ప్రయోజనం కోసమే దీనిని ప్రకటించారు తప్ప రైతుల కోసం కాదన్నారు. నిబద్దత ఉంటే వెంటనే పసుపుకి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు గురించి రాష్ట్ర మంత్రికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు తప్ప తన తండ్రి, తాను దానిని సాధించలేకపోయామని ఒప్పుకోవడం లేదు. తాము సాధించలేకపోయిన పసుపు బోర్డుని బీజేపి ఎంపీలు సాధించినందుకు వారిని అభినందించడానికి నోరు రావడం లేదు.
Also Read – ఏడుకొండలవాడా… ఈ సీబీఐ అరెస్టులు ఏమిటి?
“వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి విశాఖ సభలో ప్రధాని మోడీ చేత ప్రకటన చేయించగలరా? నిధులు సాధించి తేగలరా?” అంటూ వైసీపీ నేతలు సవాళ్ళు విసిరారు.
కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,440 కోట్లు విడుదల చేయగానే మాజీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ “వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము మొదటి నుంచి వ్యతిరేకం. మేము అడ్డుకోవడం వలననే కేంద్రం వెనక్కు తగ్గింది. అయినా ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయకుండా ఢిల్లీ వెళ్ళి నిధులు విడుదల చేయడం వెనుక మతలబు ఏమిటి?అవి ఏ మూలకు సరిపోతాయి?” అని విమర్శలు గుప్పించారు.
తాము కాపాడలేకపోయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని సిఎం చంద్రబాబు నాయుడు కాపాడే ప్రయత్నం చేస్తున్నందుకు, ఆయన ప్రయత్నాలు ఫలిస్తునందుకు వైసీపీ నేతలు సంతోషించి, ఆయనని అభినందించాలి. కానీ ఈవిదంగా వితండవాదం చేస్తున్నారు.
అక్కడ బిఆర్ఎస్ పార్టీ నేతలు, ఇక్కడ వైసీపీ నేతలు ఒక్కలాగే ఆలోచిస్తారని, ఒకేలా మాట్లాడుతారని, ఒకేలా వ్యవహరిస్తారని, చెప్పడానికి ఇంతకంటే చక్కటి ఉదాహరణలు ఏముంటాయి?