సర్వేలతో వైసీపీ మూడ్ మాడినట్టుందిగా..!

YCP Social Media

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ప్రజల నాడిని తెలుసుకుంటూ రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రాగలుగుతుంది, ఏ పార్టీ అధికారాన్ని కోల్పోతుంది అనే వాటి పై సర్వేల ఆధారంగా నివేదికలు సిద్ధం చేస్తాయి.

అయితే ఏపీలో అసలు ప్రతిపక్షమనేదే లేకుండా చేయడమే తమ లక్ష్యం అంటూ ఎన్నికల ప్రచారాలకు సిద్దమైన వైసీపీ పార్టీకి తాజాగా విడుదలైన సర్వే రిపోర్ట్స్ ఒక్కసారిగా ఆలోచనలో పడేశాయి. ప్రముఖ జాతీయ సంస్థ అయినా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ అఫ్ ది నేషన్ సర్వేలో టీడీపీ పార్టీ 17 ఎంపీ స్థానాలను, వైసీపీ 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందంటూ వైసీపీ ఆశల పై నీళ్లు చల్లారు.

ADVERTISEMENT

ఆజ్ తక్, సి ఓటర్ సర్వేలో టీడీపీ, జనసేన కూటమి 45 % ఓట్లతో అధికారం దిశగా అడుగులు వేస్తుందని, వైసీపీ 41 % ఓట్లకు పరిమితమవుతుంది అంటూ ఇవేదిక ఇచ్చారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ , జనసేన బీజేపీ కూటమితో విజయానికి దూరమైన వైసీపీ ఇపుడు కూడా 4 % ఓటింగ్ వ్యత్యాసంతో అధికారానికి దూరం కాకతప్పదు అని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.

ఇక సర్వే సంస్థలు ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ తో వైసీపీ మూడ్ పూర్తిగా మారిపోయినట్టుంది. తమకు వ్యతిరేకంగా వచ్చిన సర్వేలు ప్రజల మూడ్ ని, తమ పార్టీల నాయకుల మూడ్ ని ఎక్కడ ప్రభావితం చేసేస్తాయో అని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆ సర్వే సంస్థలకు విశ్వసనీయత లేదని, అటువంటి సర్వేలను ఎవరు నమ్మవద్దు అంటూ మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. మొత్తానికి రాష్ట్రంలో వైసీపీ కి అన్ని వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి అని చెప్పడానికి ఇదొక తార్కాణంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories