అమెరికా వద్దనుకుంటే బ్రిటన్ ఉందిగా!

india-uk-trade-deal

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నిర్ణయాలు, విధానాలతో భారత్‌తో సహా యావత్ ప్రపంచదేశాలు ఇబ్బంది పడుతున్నాయి.

ఇటువంటి సమయంలో భారత్‌-బ్రిటన్ దేశాల మద్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదరడం చాలా శుభపరిణామమే. ప్రపంచదేశాలకు అమెరికా తప్ప మరో దిక్కులేదనట్లు ట్రంప్‌ వ్యవహరిస్తునప్పుడు ఈ ఒప్పందం ద్వారా ఉందని నిరూపించాయి భారత్‌-బ్రిటన్ దేశాలు.

ADVERTISEMENT

భారత్‌ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై ట్రంప్‌ ప్రభుత్వం 26 శాతం వరకు పన్ను విధిస్తోంది. ముఖ్యంగా ఔషదాలపై 100 శాతం పన్ను విధిస్తామని పదేపదే బెదిరిస్తున్నారు.

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తే 500 శాతం సుంకాలు విదిస్తామంటూ బెదిరించడమే కార్యక్రమంలో నాటోపై కూడా ఒత్తిడి చేసి దాని చేత కూడా భారత్‌ని బెదిరిస్తున్నారు.

ట్రంప్‌ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలను కూడా బెదిరిస్తున్నారు. భారత్‌, చైనాలో ఐటి కంపెనీలు పెట్టవద్దని, భారతీయ టెకీలను తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి పరిస్థితులలో భారత్‌-బ్రిటన్ దేశాల మద్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదరడం భారత్‌కు చాలా ఉపశమనం కలిగిస్తుంది.

ఈ తాజా ఒప్పందం వలన భారత్‌ నుంచి బ్రిటన్‌కు ఎగుమతి అయ్యే పలు ఉత్పత్తులుకు ఎటువంటి సుంకాలు ఉండవు. సుంకం మినహాయించిన వాటిలో రెడీ మేడ్ దుస్తులు, కార్పెట్లు, హ్యాండీ క్రాఫ్ట్స్, చెప్పులు, బూట్లు, తోలుతో తయారు చేసిన బ్యాగులు వగైరా ఉన్నాయి. అలాగే వ్యవసాయం, ఆహార ఉత్పత్తులలో పప్పు ధాన్యాలు, ఊరగాయలు, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు, వంట నూనెలు, వివిధ రకాల పళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్, చేపలు, రొయ్యలు వగైరా ఉన్నాయి.

వివిధ రకాల యంత్రాలు, విడిభాగాలు, డయాగ్నోస్టిక్, ఎక్స్‌రే, ఈసీజీ తదితర పరికరాలు, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు, బంగారు వజ్రాభరణాలు, రసాయనాలు, కొన్ని రకాల మందులు, వంటివి చాలా ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుంది.

కనుక భారత్‌లోని ఆయా ఉత్పత్తి రంగాలకు వ్యాపారావకాశాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

బ్రిటన్‌ నుంచి భారత్‌కు దిగుమతయ్యే వాహనాలు, మద్యం తదితర ఉత్పత్తులపై భారత్‌ కూడా భారీగా సుంకాలు తగ్గించింది.

ఇటువంటి క్లిష్ట, అనిశ్చిత పరిస్థితులలో భారత్‌కు ఇటువంటి ఒప్పందాలు చాలా అవసరం. డోనాల్డ్ ట్రంప్‌ భారత్‌ పట్ల కటువుగా వ్యవహరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం చురుకుగా పావులు కదిపి బ్రిటన్‌తో ఈ ఒప్పందం చేసుకోవడం చాల తెలివిగా వ్యవహరించింది.

ADVERTISEMENT
Latest Stories