తిరుపతి తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లిన ప్రముఖ రాజకీయ నాయకులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు.
Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!
ఇక జనసేన అధినేత పవన్ జరిగిన తప్పిదానికి గాను బాధిత కుటుంబాలకు, ప్రజలకు తన తరుపున క్షమాపణ చెప్పారు. అలాగే పవన్ పర్యటన సందర్భంగా ఆసుపత్రి వద్ద ఆయన అభిమానులు జై పవర్ స్టార్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ, అరుస్తుంటే పవన్ వారి పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్త పరిచారు.
ఇక్కడ ప్రాణాలు పోయి బాధిత కుటుంబాలు రోధిస్తుంటే, పరామర్శకు వచ్చినందుకా ఈ కేరింతలు, మనుషులు చనిపోయారు అంటే కూడా ఈ అరుపులేంటి.? అంటూ తన అభిమానులను, జనసైనికులను వారించారు పవన్. అలాగే ఒక ప్రమాదం కళ్ళముందు కనిపిస్తున్నప్పటికీ పోలీస్ వ్యవస్థ క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోతుందా, ముందు వారిని కంట్రోల్ చేయండి అంటూ అధికారుల మీద కూడా మండిపడ్డారు.
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
అయితే అదే బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్ మాత్రం పరామర్శకు వచ్చారా లేక బలప్రదర్శనకు వచ్చారా అన్నట్టుగా జై జగన్, జై జగన్ అనే స్లొగన్స్, సీఎం…సీఎం అనే నినాదాలు, అరుపులు, కేకలు ఇలా ఎదో శుభకార్యానికి వచ్చినట్టు పార్టీ కార్యకర్తలు వెంటేసుకుని హంగామా చేసుకుంటూ వచ్చారు.
తమ అభిమాన నాయకుడు తమ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కానీ ఆ నాయుడుకి సంబంధించిన అభిమానులు కానీ అలా అరవడం సహజమే. కానీ దానికి ఓ సమయం సందర్భం అంటూ ఉండాలిగా.? చావు దగ్గరకు వెళ్లి పెళ్లి కబుర్లు చెప్పుకుంటామా.? కనీసం జగన్ కు ఆ సంస్కారం కూడా తెలియదా.?
Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?
అభిమానులుగా అది వారికి తెలియక పోయినా నాయకుడిగా దాన్ని గుర్తెరిగి ఆ నాయకుడే వారి మద్దతుదారులను ఈ కేరింతలకు ఇది సమయం కాదు ఆపండి అంటూ పవన్ మాదిరి నిరువరించాల్సి ఉంటుంది. అవసరమైతే నాలుగు చివాట్లు పెట్టిన తప్పులేదు. ఇప్పుడు వారి అభిమానుల పట్ల పవన్ అవలంబిస్తున్న వైఖరి ఇదే.
కానీ జగన్ మాత్రం తానొక్కడే ప్రజా నాయుకుడు, తన కోసమే ప్రజలు అందరు ఎదురు చూస్తున్నారు, తన ఓదార్పు కోరుకుంటున్నారు అన్నట్టుగా ఇలా చావుల దగ్గరకు వెళ్లి బాల ప్రదర్శన చేసుకోవడం నిజంగా సంస్కార లేమే అవుతుంది. జరిగింది తప్పే, దాన్ని ప్రభుత్వ పెద్దలేమి వెనకేసుకురావడం లేదు.
ఈ తొక్కిసలాట కు కారణాన్ని ఘటన బాధితులనే అడిగి తెలుసుకుంటూ వారి చెప్పిన సమాచారం మేరకు నిర్లక్ష్యానికి కారణమైన వారి పై చర్యలు తీసుకున్నారు. తప్పు జరిగింది క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పారు. అలాగే అరుపులు కేకలు వేసిన తమ అభిమానులను తప్పని వారించి వారికి హితవు పలికారు. కానీ జగన్ చేసిందేమిటి.? గత ఐదేళ్లు చేసిన ‘ఐ పాక్’ రాజకీయాలే ఇంకా కొనసాగిస్తాం అంటే ఎలా.?
ఐ పాక్ టీం ను పెట్టుకుని తనను తానే ఒక ప్రజా నాయకుడిగా ప్రచారం చేసుకుని, ప్రత్యర్థి పార్టీల నేతలకు ప్రజలలో బలం లేదంటూ చెప్పుకుంటూ సిద్ధమా…సిద్ధమా అంటూ తిరిగిన జగన్ ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయాన్ని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.