IPL 2025

ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ను సొంతం చేసుకున్న భారత జట్టు, అటు పిమ్మట స్వదేశానికి వచ్చాక కూడా ఆర్భాటాలకు దూరంగానే ఉంది. కేవలం కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కాసేపు మీడియాతో ముచ్చటించారు. గతేడాది టి- 20 వరల్డ్ కప్ నెగ్గాక, జట్టు సభ్యులంతా కలిసి నెగ్గిన ట్రోఫీ ను రోడ్ షో చేస్తూ ముంబై లోని వాన్ఖేడే మైదానానికి ఆర్భాటంగా పట్టుకెళ్లారు.

అయితే ఈసారి అలా చేసేందుకు ఐపీఎల్ అడ్డంకి గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వారానికే ఐపీఎల్ లో పాల్గొనాల్సి ఉండగా, జట్టు సభ్యులంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లి, తమ కుటుంబం తో కాస్త సమయాన్ని గడుపుతామని జట్టు బోర్డును అడగగా, బోర్డు కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

Also Read – పోసాని కి దక్కని జగన్ ఓదార్పు…వై.?

ఇక కొందరు ఆటగాళ్లు ఇప్పటికే తమ ఫ్రాంచైజ్ తో కలిసి తమ హోమ్ గ్రౌండ్ లో సాధన మొదలుపెట్టేసారు కూడా. ట్రోఫీ ను నెగ్గిన జట్టు లో ఉన్న జడేజా మరియు పాండ్య నేరుగా తమ ఫ్రాంచైజ్ ల వద్దకే వెళ్లారు. ఇంకా, ప్రతి జట్టులో మెజారిటీ ఆటగాళ్లు ఇప్పటికే ఫ్రాంచైజ్ లను చేరుకున్నారు ఐపియల్ సమరానికి సిద్ధమవుతున్నారు.

ఇంకా కోహ్లీ, రోహిత్, గిల్, అయ్యర్, రాహుల్, కుల్దీప్, వరుణ్, షమీ వంటి బడా ఆటగాళ్లు ఇంకా తమ జట్లను కలవాల్సి ఉంది. అభిమానులంతా 12 నెలల సంవత్సరంలో ఈ మూడు నెలల క్రికెట్ మజా ను ఆస్వాదించడం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఇక టీం ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ధోని అభిమానులు ఆయన మైదానంలో అడుగు పెట్టె క్షణాల కోసం ఆతృతగా ఉంటారు.

Also Read – యాదగిరిగుట్టకు ఓ బోర్డు… అవసరమా?

అలాగే ఈ సారి కప్పు మనదే అంటూ కోహ్లీ అభిమానులను ఊరించే ఆర్సీబీ ప్రతి ఏటా ఐపీఎల్ ప్రారంభమయ్యే వారం ముందు, చిన్నస్వామి మైదానంలో జెర్సీ రివీల్ అంటూ ఒక ఈవెంట్ పెట్టి, ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈ ఏడు ఆ ఈవెంట్ మార్చ్ 17 న జరగనుంది.

అయితే IPL చరిత్రలోనే మోస్ట్ సెక్సెస్ ఫుల్ టీం గా పేరు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ టీం గత ఏడాది కెప్టెన్సీ మార్పు తో విమర్శలు మూటకట్టుకుంది. అలాగే ముంబై కు కొత్త కెప్టెన్ గా వచ్చిన పాండ్య పై తీవ్ర వ్యతిరికతను వ్యక్త పరిచారు ముంబై అభిమానులు. మరి ఈసారి ముంబై ఇండియన్స్ ఫాన్స్ పాండ్య సారధ్యాన్ని అంగీకరిస్తారా.? లేక రోహిత్ వైపు మొగ్గుచూపుతారా.?

Also Read – అమరావతి ‘పట్టాభిషేకం’…వైసీపీ ‘అరణ్యవాసం’..!

అయితే అంతర్జాతీయ క్రికెట్ లో అందరూ ఒక్కటై టీం ఇండియా విజయం కోసం మైదానంలో పోరాడే మన క్రికెట్ హీరోలు ఇపుడు తమ తమ ప్రాంజైజీస్ గెలుపు కోసం అంతర్గత పోరుకి సిద్ధమవుతున్నారు. అలాగే గతేడాది ఐపిల్ విజేతగా నిలిచిన KKR టీం గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో కప్పుని సొంతం చేసుకుంది.

ఇలా, సీనియర్, జూనియర్, దేశీయ, విదేశీ ఆటగాళ్లతో మొదలయ్యే ఐపీఎల్ ఫీవర్ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. సమ్మర్ సీజన్లో అందరికి ఆటవిడుపుతో పాటు మంచి ఆహ్లాదాన్ని, ఎంగ్జైటీని కలిగించే ఈ 20 ఓవర్లు ఐపిల్ క్రికెట్ అభిమానులకే కాదు బెట్టింగ్ మహారాజులకు కూడా మంచి కిక్ ఇస్తుంది.




ఇప్పటికే తమ ఫెవరెట్ జట్టుకు తమ మద్దతుగా తలా ఫర్ రీజన్ అంటూ ఒకరు, ఈ సాలా కప్పు నందే అంటూ మరొకరు సోషల్ మీడియా వేదికగా అంతర్యుద్ధానికి దిగుతున్నారు. చూడాలి మరి ఈ సాలా IPL కప్పు ఎవరిదో.?