సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్…అవసరమా.?

IPL 2025 Social Media Fan Wars

18 ఏళ్ళ ముందు క్రికెట్ అభిమానులకు అప్పుడప్పుడే వన్-డే, టెస్ట్ ఫార్మాట్ల పై కాస్త ఆసక్తి తగ్గుతున్న తరుణంలో, ఆట సమయాన్ని కుదించి, 50 ఓవర్ల మ్యాచ్ ను కేవలం 20 ఓవర్లుగా చేసి టి-20 అంటూ క్రికెట్ ను సరికొత్తగా మరింత ఆహ్లాదంగా మరలా ప్రపంచానికి పరిచయం చేసింది ఐసీసీ. ఇక, ఆ ఫార్మటు కు గాను మొదటి ఐసీసీ ట్రోఫీ ను గెలుచుకుంది భారత జట్టు.

2007 లో సోత్ ఆఫ్రికా వేదికగా జరిగిన మొదటి టి-20 ప్రపంచ కప్ ను భారత్ కైవసం చేసుకున్న రోజులవి. అప్పటికే, బీసీసీఐ మదిలో తమకంటూ ఒక సెపరేట్ లీగ్ నిర్వహించటం ఉత్తమం అని భావిస్తున్న సందర్భంలో, దేశవాళీ టోర్నీ లలో అబ్బురపరిచే సత్తా ఉన్న ఆటగాళ్లు బోర్డు దృష్టిలో పడతారనే అభిప్రాయం తో బోర్డు సభ్యులు ఒక నిర్ణయానికొచ్చారు.

ADVERTISEMENT

భారతీయులందరి కోసం సెపరేట్ గా ఈ పొట్టి ఫార్మాట్ లో ఐపీఎల్ అంటూ ఒక లీగ్ ను మొదలు పెట్టారు. అప్పుడే టి-20 ప్రపంచకప్ ను అందుకున్న, భారతీయుల కళ్లన్నీ ఈ పొట్టి ఫార్మటు పైనే ఉన్నాయి. ఇక, జట్టు లో 7 భారతీయలు, మరొక 4 విదేశీ ఆటగాళ్లను సమకూర్చుకునే విధంగా బీసీసీఐ బోర్డు ఆదేశాలు జారీచేశారు.

దీనితో ఎందరో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు ఉపాధిగా, మంచి అవకాశంగా ఈ ఐపీఎల్ మారనుంది అన్న వాదన బలంగా వినిపించింది నాడు. వారు ఊహించినట్టు గానే, ఈ ఐపీఎల్ రాకతో ఎందరో యువ ఆటగాళ్ల భవిష్యత్ మారింది. కేవలం భారతీయులే కాదు, విదేశీ యువకుల భవిష్యత్ ను కూడా తీర్చిదిద్దింది ఈ ఐపీఎల్.

కానీ ప్రస్తుతం జరుగుతున్న సన్నివేశాలు చూస్తే, అసలు ఈ లీగ్ ను మొదలుపెట్టిన కారణమేంటి.. ఇప్పుడు జరుగుతున్నదేంటి..? అన్న సందేహం రాకమానదు. ప్రపంచ దేశాలన్నీ కోహ్లీ, రోహిత్ మరియు ధోని ను ‘కింగ్, హిట్-మ్యాన్, తల’ అని బిరుదులివ్వగా, మన భారతీయులు మాత్రం ఈ ఐపీఎల్ కారణంగా వీరిని ‘చోక్లి, వాడాపావ్ మరియు దోబీ’ అని అసభ్యమైన ట్రోల్స్ చేస్తుంటారు.

భారతీయ నైపుణ్యం పైకి రావాలని మొదలుపెట్టిన ఈ లీగ్ లో రాను రాను సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ తో భారతీయుల మధ్య అంతర్యుద్ధం లా మారుతుంది. ఈ ఐపీఎల్ సీజన్ మొదలవుతుంది అనగానే, ఎక్స్ (X ) లో ఫాన్స్ అంతా తమ తమ జట్లకు మద్దతుగా ఫ్యాన్-వార్స్ చేసుకుంటూనే ఉంటారు. ఆఖరికి వీరి సంభాషణ ఆటగాళ్ల కుటుంబ సభ్యులను సైతం దూషించే స్థాయికి దిగజారిపోలే మారిపోయింది.

టీం ఇండియా జర్సీ వేసుకున్నప్పుడు దేశ గౌరవానికి ప్రతీకగా భావించే క్రికెటర్స్ ని ఈ ఐపీఎల్ కారణంగా చెన్నై, బెంగళూర్, హైద్రాబాద్, పంజాబ్, ఢిల్లీ, లక్నో, కోల్కత్త అంటూ రాష్ట్రాలుగా విభజించి మన ఆటగాళ్ల పై మనమే విమర్శలు చేస్తూ ఫ్యాన్ వార్స్ రూపంలో వారిని కించపరచుకోవడం ఎంతవరకు సమంజసం.?

ఐపీఎల్ ద్వారా ఎందరో టాలెంట్ ఉన్న యువ క్రికెటర్స్ రేపటి రోజున టీం ఇండియా విజయం కోసం మైదానంలో చమటలు కార్చడం ఖాయం. మరి అలాంటి దేశ భవిష్యత్ ని ఇలా రాష్ట్రాలుగా విభజించి ద్వేషించడం అవసరమా.? ఢిల్లీ అయినా బెంగళూర్ అయినా హైద్రాబాద్ అయినా కోల్కత్త అయినా వీరందరి లక్ష్యం టీం ఇండియా లో చోటు సాధించడమే. దేశం కోసం మైదానంలో ప్రత్యర్థి జట్టుతో యుద్ధం చేయడమే. అయితే రేపటి నుంచే ఈ ఐపీఎల్ మహా సంగ్రామం RCB వైస్ KKR జట్ల మధ్య మొదలుకానుంది.

ADVERTISEMENT
Latest Stories