వేలంలో కాసుల వర్షం..మరి మైదానంలో.?

ipl-2025-final-squad

ప్రతీ ఏడు ఐపీఎల్ ప్రారంభానికి 3 -4 మాసాల ముందు ఆ లీగ్ లో పాల్గొనబోయే ఆటగాళ్లందరినీ ఒక లిస్ట్ చేసి, ఐపీఎల్ ఆక్షన్ అంటూ ఆటగాళ్ల వేలాన్ని ప్రదర్శింపజేస్తారు బీసీసీఐ బోర్డు. అయితే, ఆ వేలానికి వచ్చే ఆటగాళ్ల సంఖ్య వందల్లో ఉంటే దానికయ్యే వ్యయం కొన్ని వందల కోట్ల పైమాటే ఉంటుంది.

ADVERTISEMENT

ఈ వేలంలో భారతీయులు, ఫారెన్ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. కాగా, ప్రతి ఏటా జరిగే ఈ వేలంలో ఎవరో ఒక ఆటగాడి జీవితం మలుపు తిరుగుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా భారత యువకుల విషయంలో ఇది తరచుగా జరుగుతుంటుంది. దేశవాళీ టోర్నీలలో ఫ్రాంచైజీలను ఆకట్టుకున్న యువకులకు ఐపీఎల్ వేలంలో కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది.

ఇలాగే 2024 ఐపీఎల్ కోసం సమీర్ రిజ్వి ను చెన్నై జట్టు ఏకంగా 10 కోట్లు పెట్టి దక్కించుకోగా, పట్టుమని 10 మ్యాచ్లు కూడా ఆడించకుండానే టీం నుండి తొలగించారు. ఇక, సీనియర్ ఆటగాళ్లు కనుక ఈ వేలం లో అడుగు పెడితే, వారికి కాసుల పండగ జరగటం ఖాయం.

2024 ఐపీఎల్ సీజన్ యొక్క ఆక్షన్ లో ఆస్ట్రేలియా కు చెందిన మిచెల్ స్టార్క్ ను ఏకంగా 25 కోట్లు, కమిన్స్ ను 24 .75 కోట్లు పెట్టి కె.కె.ఆర్ మరియు హైదరాబాద్ జట్లు కొనుగోలు చేశాయి. ఇక అప్పటి వరుకు ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించిన స్టార్క్ గతేడాది జరిగిన ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన కనబరిచి కె.కె.ఆర్ యాజమాన్యానికి పెద్ద బొక్కే పెట్టాడని పలువురు సీనియర్లు కూడా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈసారి జరిగిన వేలం లో అయ్యర్ ను 26 .75 కోట్లు వెచ్చించి కొనుగోలుచేశారు పంజాబ్ జట్టు, అదే ఇప్పటి వరకు అత్యధిక ధర అనుకున్న కొద్ది నిముషాలకే భారత వికెట్-కీపర్ మరియు మాజీ ఢిల్లీ జట్టు కెప్టెన్ ‘రిషబ్ పంత్’ రాకతో లక్నో జట్టు పంత్ ను ఏకంగా 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసి ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది.

అలాగే, యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ కు ఎవ్వరు ఊహించని విధంగా కె.కె.ఆర్ యాజమాన్యం ఏకంగా 23 .75 కోట్లు పెట్టి కొనుగోలు జేశారు. కానీ, గత కొన్నేళ్ల ఆనవాయితీ బట్టి చూస్కుంటే, భారీ ధర పలికిన ఆటగాళ్లెవరూ మైదానంలో తమ ధర ను సమకూలించే ప్రదర్శన కనబరచలేకపోతున్నారు.

మరి ఈ సీజన్లోనైనా భారీ ధర పలికిన ఆటగాళ్లు ఆ టీంలకు భారీ విజయాలు అందించగలరా లేక టీం కి భారం అవుతారా.? అనేది చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories