ipl-movies-ott-on-summer

ప్రతి ఏటా సమ్మర్ హాలిడేస్ ను సరదాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి అటు సినిమాలు, ఇటు ఐపీఎల్ మ్యాచ్ లు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు దానికి తోడు ఓటిటి వినోదం కూడా ప్రేక్షకుడి ని ఇంటి వద్దకే వచ్చి పలకరిస్తున్నాయి.

ఇప్పటికే ఐపీఎల్ 18 వ సీజన్ తన లీగ్ మ్యాచ్ లతో క్రికెట్ అభిమానులకు కావాల్సినంత ఎంజాయ్ మెంట్ ను కలిగిస్తున్నాయి. ఎవరి ఫేవరేట్ టీం గెలుపు కోసం వారికీ మద్దతుగా మైదానంలో కేరింతలు కొడుతున్నారు క్రికెట్ లవర్స్, అలాగే ఆతృతగా టీవీ ల ముందు కూర్చుంటున్నారు.

Also Read – ఇక దువ్వాడ జీవితం మాధుర్యమే

ఇక సినిమా ల విషయానికి వస్తే ఇప్పటికే ఈ సమ్మర్ కానుకగా నితిన్ రాబిన్ హుడ్, నాగ వంశీ మాడ్ స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రాగ మాడ్ స్క్వేర్ బాక్స్ ఆఫీస్ విజయాన్ని సొంత చేసుకుంది. ఇక ఏప్రిల్ 10 న సిద్దు జొన్నలగడ్డ, బేబీ ఫ్రేమ్ వైష్ణవి చైతన్య నటించిన ‘జాక్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే ఈ ఏడూ సమ్మర్ మూవీలలో బడా స్టార్ హీరోస్ సినిమాలు కనిపించకపోవడం కాస్త అభిమానులను నిరాశ పరిచే విషయమనే చెప్పాలి. పుష్ప -2 తో కాస్త గ్యాప్ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్ మైథలాజి మూవీ లో నటించనున్నారు. ఇక తారక్ దేవర తరువాత బాలీవుడ్ వార్- 2 మూవీ తో బిజీ అయ్యారు.

Also Read – జగన్‌తో సహవాసం.. ముగింపు ఇలాగే!

ప్రశాంత్ నీల్, తారక్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఆ మూవీ విడుదల కు మరో క్యాలెండరు మారాల్సిందే. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే, ఉప్పెన ఫ్రేమ్ బుచ్చిబాబుతో ‘పెద్ది’ మూవీ షూటింగ్ జరుగుతుంది. పవన్ హరిహర వీరమల్లు, OG గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే వారి అభిమానులకు అంత మంచిది అనేలా పరిస్థితులు మారిపోయాయి.

ఇక ఈ సమ్మర్ వినోదం లో డార్లింగ్ ప్రభాస్ ‘రాజా సాబ్’ అయినా ప్రేక్షకుల ముందుకొస్తుందేమో చూడాలి. హిట్ – 3 తో న్యాచురల్ స్టార్ నాని మే 1 వ తేదీన థియేటర్లలోకి రానున్నారు. ఈ రెండు సినిమాలను మినహాయిస్తే ఈ సమ్మర్ లో చిన్న సినిమాల హవనే ఎక్కువగా కనిపిస్తుంది.

Also Read – పవన్ కోసం దర్శక నిర్మాతల ఎదురుచూపులు


అలాగే ఇటు థియేటర్లకు వెళ్లలేని బుల్లి తెర అభిమనుల కోసం ఎలాగూ ఓటిటి అందుబాటులోనే ఉండడంతో వారి కోసం కూడా అనేక వెబ్ సిరీస్లు ఈ సమ్మర్ కానుకగా రానున్నాయి. స్టార్స్ యాక్టర్స్, యాక్ట్రెస్స్ సైతం వెబ్ సిరీస్ లలో భాగమయ్యేందుకు ముందుకొస్తుండడంతో ఇప్పుడు ఈ సిరీస్ ల మీద కూడా ప్రేక్షకులలో మంచి బజ్ ఏర్పాటుడుతుంది.