కేసీఆర్ పోరాటాలతో, హరీష్ రావు కష్టంతో ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తెరాస దేశ రాజకీయాలను తెలంగాణ వైపు చూసేలా చేసింది. పక్క పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ఒక్కో మెట్టు ఎదిగిన పార్టీ చివరికి తెలంగాణ రాజకీయాలను శాసిస్తూ అక్కడ తమకు వ్యతిరేకంగా గళం విప్పడానికి ప్రతిపక్షం కూడా లేకుండా చేయగలిగింది.
Also Read – విదేశాలకు రేషన్ బియ్యం రవాణా ఏవిదంగా అంటే..
ఇంతటి చరిత్ర కలిగిన తెరాస తన ప్రాంతీయ వాదాన్ని వీడి దేశీయ వాదాన్ని తలెకెత్తుకుని చతికిల పడింది. దీనితో ఇక తెలంగాణలో తెరాస చరిత్ర ఇక్కడితో ముగిసింది, బిఆర్ఎస్ అయితే అటు కాంగ్రెస్ పార్టీలో కానీ లేకుంటే ఇటు బీజేపీలో కాని విలీనం కాకా తప్పదు అనే పుకార్లు తెలంగాణ రాజకీయాలలో పెత్తనం చేసాయి.
వాటన్నిటిని పటాపంచలు చేస్తూ కేటీఆర్ నాయకత్వంతో బిఆర్ఎస్ రేవంత్ సర్కార్ మీద దూకుడుగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత స్థానం కేటీఆర్ దే అంటూ ఒక వర్గం ఊపుమీద ఉంది. అలాగే తెలంగాణలో ఐదేళ్ల తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ముందుకొస్తారు అనే పుకార్లు కూడా పుట్టుకొస్తున్నాయి.
Also Read – సీక్వెల్స్: వైఫల్యం నుండి విజయం వరకు
అయితే ఈ పుకార్లు నిజంగా కార్యరూపం దాల్చితే అందుకు బిఆర్ఎస్ బలోపేతానికి తనవంతు కృషి చేసిన హరీష్ రావు ఆమోదం దక్కుతుందా అనేది ఒక సందేహం. హరీష్ రావు ను కాదని కేసీఆర్ కూడా పార్టీ తరుపున ఎటువంటి బలమైన నిర్ణయానికి ముందడుగు వెయ్యలేరు. ఇప్పటికే కేటీఆర్ నాయకత్వంతో పని చేయడానికి హరీష్ వ్యతిరేకమని, ఆ పరిస్థితి వస్తే బిఆర్ఎస్ పార్టీలో చీలిక తప్పదని కాంగ్రెస్, బీజేపీ నేతలు పలుమార్లు రాజకీయ ప్రకటనలు గుప్పించారు.
హరీష్ రావు, కేసీఆర్ కారు దిగి తన వర్గం ఎమ్మెల్యే లతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాబోయే ఎన్నికలలో బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారంటూ తెలంగాణ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రచారం కూడా చేసారు. అలాగే కేటీఆర్ కు హరీష్ రావు కు మధ్య అంతర్గతం పోరు జరుగుతూ ఉంటుందని బిఆర్ఎస్ పార్టీలో కూడా అప్పుడప్పుడు టాక్ బయటకొస్తూనే ఉంటుంది.
Also Read – ‘గుడ్డి’ ప్రభుత్వానికి…’గుడ్డు’ మంత్రికి…’గూగుల్’ విలువ తెలుసా.?
ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆకాంక్షలకు, కేసీఆర్ నిర్ణయాలకు హరీష్ తనవంచుతారా.? నాయకత్వ మార్పుతో బిఆర్ఎస్ లో చీలిక రాకుండా హరీష్ కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు తన ఆమోద ముద్ర వేస్తారా.? అయితే రాజకీయాలలో బంధాలు, బంధుత్వాల కన్నా అధికారం, పదవులే ముఖ్యమని ,అవి రక్త సంబంధాలను కూడా నిట్టనిలువా చీల్చగలవని వైస్ కుటుంబాన్ని చూస్తే యిట్టె అర్ధమవుతుంది.
ఇటువంటి తరుణంలో బిఆర్ఎస్ పార్టీ అధినేతగా, బిఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ను కాదని, హరీష్ ను ఒప్పించి కేటీఆర్ ను రాజకీయ తెర ముందుకు తెచ్చే సాహసం చేస్తారా.? ఇలా ఎన్నో ప్రశ్నలు బిఆర్ఎస్ కారుకు స్పీడ్ బ్రేకర్స్ మాదిరి ఎదురుపడుతూనే ఉంటాయి.