కేవలం తన వ్యక్తిగత అహాన్ని చల్లార్చుకోవడానికి ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర రాజధానిని సమాధి చేసిన ఘనత ఒక్క వైస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కింది. అయితే గత ఐదేళ్ల అమరావతి అభివృద్ధికి ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్ చర్యలతో అమరావతి ప్రాంతం అరణ్య మయమయ్యింది.
ఆ అరణ్య రోధనకి, పోరాటాలకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనేలా తిరిగి బాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అమరావతి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆమోద ముద్ర వేసి అందుకు కావాల్సిన నిధులను కూడా సమకూర్చడానికి ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామంటూ హామీ ఇచ్చింది.
అయితే అందుకు తగ్గట్టే అమరావతి పునర్నిర్మాణానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో అడుగు ముందు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే నేడు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు అందించింది. సుమారు 2245 కోట్లతో అమరావతికి 57 కిమీ చొప్పున కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్టవ్ ప్రకటించారు.
ఇందుకు గాను కృష్ణా నది పై 3 . 2 కిమీ మేర పొడవైన వంతెన నిర్మాణం చేపట్టనుంది. అయితే హైద్రాబాద్, కోల్కత్త, చెన్నై వంటి ప్రధాన మెట్రో నగరాలతో అమరావతిని అనుసంధానం చేస్తూ ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. అలాగే ఏపీలో మచిలీపట్టణం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను కలుపుతూ వెళ్లనుంది.
సుమారు 2600 కోట్లు అంచనా వ్యయం తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. గత ఐదేళ్లు తన గుర్తింపు కోసం పోరాడిన అమరావతి ఇప్పుడు తన గుర్తింపుని హక్కుగా రాబట్టుకోగలుగుతుంది. టీడీపీ ప్రభుత్వం అమరావతికి పునాదులేస్తే వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని సమాధి చేసింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సమాదైన అమరావతికి తిరిగి పూర్వవైభవం సాధించేందుకు కృషి చేస్తుంది. ప్రభుత్వాలు మారితే ఒక ప్రాంతం తల రాత ఈవిధంగా మారుతుందా అనేందుకు అమరావతి ప్రపంచానికే ఉదాహరణగా నిలిచింది.




