
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జాతకాలు, వాస్తు నమ్మకాలు చాలా ఎక్కువ కనుక వాస్తు దోషం ఉన్న పాత సచివాలయాన్ని కూల్పించేసి సుమారు రూ.1200 కోట్లతో వైట్ హౌస్ వంటి కొత్త సచివాలయం నిర్మించుకున్నారు. కానీ దానిలో అడుగుపెట్టిన ఆరు నెలలకే ఎన్నికలలో ఓడిపోయి ముఖ్యమంత్రి పదవి, అధికారం కోల్పోయారు.
Also Read – చంద్రబాబు దూరదృష్టి వలన ఏపీ సేఫ్!
ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. పదేళ్ళు తిరుగులేకుండా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌కి పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో వాస్తు దోషం ఉందని ఎవరో చెప్పడంతో ప్రవేశ ద్వారాలలో మార్పులు చేర్పులు చేయించారు.
కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన తెలంగాణ భవన్‌లో అడుగు పెట్టలేదు. గత ఏదాడిగా ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్న కేసీఆర్ దోష నివారణకు అక్కడే యజ్ఞయాగాలు కూడా చేశారు. కానీ ఆయన గ్రహస్థితి ఇంకా మారకపోగా కొడుకు కేటీఆర్ మెడకు ఎఫ్-1 రేసింగ్ కేసు చుట్టుకోగా, కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టుల కేసులు చుట్టుకునేలా ఉన్నాయి. కనుక కేసీఆర్ నేటికీ ఫామ్‌హౌస్‌లోనే మౌనంగా ఉండిపోయారు.
Also Read – బొత్సగారు.. మీ అనుభవమే వృధా అవుతోంది!
అయితే తెలంగాణలో తిరుగులేదనుకున్న కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన సిఎం రేవంత్ రెడ్డికి కూడా వాస్తు భయాలు మొదలైన్నట్లే ఉన్నాయి.
కేసీఆర్ వాస్తు లెక్కలన్నీ చూసుకొని కట్టించిన కొత్త సచివాలయంలో ప్రధాన ద్వారానికి కొన్ని మార్పులు చేర్పులు చేయించారు. కానీ ఇంకా ఆయనలో భయం పోయిన్నట్లు లేదు. బహుశః అందుకేనేమో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లున్నారు.
Also Read – తెలంగాణలో మొదలైన ‘రిజర్వేషన్ల’ లొల్లి..!
ఇటీవల తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది ప్రభుత్వం. ఆ నివేదికపై సిఎం రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే మంత్రులతో, అధికారులతో సమావేశమయ్యి చర్చించారు.
కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేసి నగరం నడిబొడ్డున సకల సౌకర్యాలతో వాస్తు ప్రకారం కట్టించిన సచివాలయం ఉండగా, రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కీలకమైన సమావేశాలు నిర్వహిస్తుండటం గమనిస్తే, ఆయన కూడా సచివాలయంలో అడుగుపెడితే అధికారం కోల్పోతానని భయపడుతున్నారా?అనే సందేహం కలుగక మానదు.