YSR Congress Party Protests Against TDP

ఏపీలో సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 10 నెలలు కాలేదు. కానీ ఎన్నికల హామీలు అమలుచేయలేదంటూ మొదటి నెల నుంచే వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నేతలు, వారి మీడియా విమర్శించడం మొదలుపెట్టేశాయి.

జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులు, కాంట్రాక్టర్లకు ఎగవేసిన పెండింగ్ బిల్లులు ఒక్కోటి చెల్లిస్తూనే సూపర్ సిక్స్ హామీలను కూడా ఒక్కోటి అమలు చేస్తోంది.

Also Read – కేసీఆర్‌ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?

ఏప్రిల్ నెలలో మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టేందుకు అనుమతి ఉండదు కనుక ఆ సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున అందించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

మే నెలలో తల్లికి వందనం పధకం కింద ఒక ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికీ రూ.15,000 చొప్పున చెల్లించబోతున్నామని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

ఈ పధకానికి సంబందించి మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని, వాటికనుగుణంగా లబ్ధిదారులను గుర్తించి, వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా ఈ పధకం అమలుచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

అన్నదాత పధకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి మూడు వాయిదాలలో రూ.5000, రూ.5000, రూ.4000 చొప్పున అందించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!

ఇప్పటికే ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌ బకాయిలు రెండు విడతలు చెల్లించింది. త్వరలోనే మరో విడతలో రూ.400 కోట్లు విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇంతకాలం చంద్రబాబు నాయుడు హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ వైసీపీ ధర్నాలు చేస్తోంది. కానీ ఏడాదిలోగానే నాలుగైదు పెద్ద హామీలు అమలుచేసేస్తే వాటి గురించి నిలదీయడానికి, ధర్నాలు చేసుకోవడానికి వైసీపీకి అవకాశం ఉండదు.




సిఎం చంద్రబాబు నాయుడు ఎలాగూ తల్లికి వందనం హామీ తదితర హామీలకు షెడ్యూల్‌ ప్రకటించేశారు. కనుక వాటిని అమలుచేయాలంటూ వైసీపీ ఇప్పుడే ధర్నాలు చేసుకుంటే, ఆ తర్వాత తాము ధర్నాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేయించామని చెప్పుకోవచ్చు కదా.. ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌ ధర్నాలు చేసిన్నట్లు!