ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలవుతున్నా ముందుగా రెండు విషయాలు వినపడుతుంటాయి. 1. జగన్‌కు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా. 2. శాసనసభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే మాట.
ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేవు. కానీ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు నిన్న మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభ్యులు ఎవరైనా 60 పని దినాలు హాజరు కాకపోతే వారి సభ్యత్వం రద్దవుతుంది. ఇది నేను చెపుతున్న మాట కాదు. రాజ్యాంగంలో ఉన్నదే చెపుతున్నాను.
గతంలో చంద్రబాబు నాయుడు కూడా రెండేళ్ళపాటు శాసనసభకు రాలేదు కదా?అనే ప్రశ్న వినపడుతోంది. గత ప్రభుత్వ హయంలో 5 ఏళ్ళలో శాసనసభ 67 దినాలే పని చేసింది. చివరి రెండు సంవత్సరాలలో సుమారు 35 రోజులు మాత్రమే పనిచేసింది. కనుకనే చంద్రబాబు నాయుడు సభ్యత్వం రద్దు కాలేదు.
కానీ ఇప్పుడు మరో 25 పని దినాలు జరిగి, జగన్ శాసనసభకు హాజరుకాకపోతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది,” అని చెప్పారు.
ఉప సభాపతిగా రఘురామ కృష్ణరాజు ఈ విషయంలో చట్టపరమైన నిబందన గురించి సామాన్య ప్రజలకు అర్దమయ్యేలా వివరించడం చాలా అభినందనీయం. కానీ ఇది జగన్‌కి మరిచిపోకుండా గుర్తు చేస్తున్నట్లే అనిపిస్తుంది. కానీ 60 రోజుల నిబంధన గురించి పదేపదే చెపుతుండటం వలన చాలా మంది రిజిస్టర్‌లో సంతకాలు చేసి సమావేశాలకు హాజరు కాకుండా వెళ్ళిపోతున్నారు.
మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే చేస్తున్నారు. సభకు రాకుండా కుంటిసాకులతో మొహం చాటేస్తున్నప్పుడు, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నప్పుడే ప్రజా ప్రతినిధులు అందరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరవుతారు కదా?
కానీ వారిని పదేపదే హెచ్చరిస్తూ వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయేలా చేయడం అవసరమా? ప్రభుత్వోద్యోగులు కూడా పని చేయకుండా ఇలాగే సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతామంటే ప్రభుత్వం ఊరుకుంటుందా?
రాజ్యాంగంలో రాసిందే మేము చెబుతున్నాము
ఇంక 25 రోజులు అసెంబ్లీకి రాకపోతే #YSJagan 60 రోజులు అసెంబ్లీకి రానట్టు కౌంట్ అవుతుంది.. తర్వాత మేము ఏమి చేయలేము – డిప్యూటీ స్పీకర్#AndhraPradesh #apassembly pic.twitter.com/A22EviorCa
— greatandhra (@greatandhranews) October 23, 2025






