జగన్‌ క్రిమినల్ రాజకీయాలకు మరో నిదర్శనం

Jagan’s Criminal Politics Exposed by Lokesh

జగన్‌ రాజకీయాలలో ప్రవేశించక ముందే ‘క్విడ్ ప్రో’ పద్దతి కనిపెట్టి విజయవంతంగా అమలు చేసి జైలుకి వెళ్ళి వచ్చారు. ఆయన ఘన చరిత్ర తెలిసి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఏపీ ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు.

ప్రజలు తనను నమ్మి అధికారం అప్పజేపితే జగన్‌ ఏం చేశారో, అధికారం కోల్పోయినా కూడా ఇంకా ఏం చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

జగన్‌ నేరపూరితమైన రాజకీయాలను మంత్రి నారా లోకేష్‌ చక్కగా విశ్లేషించారు. “క్రిమినల్ రాజకీయాలు చేయడం జగన్‌కు మొదటి నుంచి అలవాటు. ఇందుకు ఓ ఉదాహరణ చెపుతాను.

మేము రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సింగపూర్ వెళ్ళి వరుసపెట్టి సమావేశాలలో పాల్గొంటుంటే, వైసీపీతో సంబంధం ఉన్న మురళీకృష్ణ అనే ఓ వ్యక్తి, సింగపూర్ అధికారులకు, మేము సమావేశమవుతున్న సంస్థలకు ఈ మెయిల్స్ పంపించాడు.

దానిలో ఏం వ్రాశాడంటే, ఏపీలో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం కూలిపోవచ్చు. మీతో సమావేశమవుతున్న ఏపీ సిఎం, మంత్రులు ఎక్కువ కాలం ఆ పదవుల్లో ఉండక పోవచ్చు. కనుక మీరు వారి మాటలు నమ్మి ఏపీలో పెట్టుబడులు పెడితే నష్టపోతారని ఈమెయిల్స్ పంపాడు.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తేలేదు. పైగా ఉన్నవాటిని కూడా తరిమేశారు. ఇప్పుడు మేము తెస్తుంటే వాటికీ ఈవిదంగా అడ్డుపడుతున్నారు.

మేము టీసీఎస్ కంపెనీకి ఎకరం 99 పైసలు చొప్పున భూమి కేటాయిస్తే దానినీ అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్‌ వేయించారు. అప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే వారికి గడ్డి పెట్టారు కదా?

ఒక ఐటి కంపెనీ, పరిశ్రమ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. కనుకనే భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తున్నాము తప్ప వేరే కారణం లేదు.

కానీ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదని జగన్‌ కుట్రలు చేస్తున్నారు. రాకుండా చేయగలిగితే అప్పుడు కూడా మమ్మల్నే విమర్శిస్తారు.

మేము రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే రేపు నన్ను ఎవరు గుర్తుంచుకుంటారు? మాకు ఎవరు ఓట్లు వేస్తారు? అని జగన్‌ ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇటువంటి కుట్రలు చేస్తున్నారు,” అని మంత్రి నారా లోకేష్‌ అన్నారు.

వైసీపీ నేతలు, కార్యకర్తల చేత టీడీపి నేతలను రెచ్చగొట్టేవిదంగా మాట్లాడించడం, వారిపై కేసులు నమోదైతే వారిని పరామర్శించే పేరుతో జగన్‌ బల ప్రదర్శన చేయడం, ఆ సందర్భంగా ఘర్షణలు చెలరేగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ జగన్‌ ఆరోపణలు చేస్తుండటం వంటివి నిశితంగా గమనిస్తే, ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే చేస్తున్న రాజకీయ కుట్రలని అర్ధమవుతుంది. ఈవిదంగా రాష్ట్రంలో అరాచక పరిస్థితిని సృష్టించడం ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని మంత్రి నారా లోకేష్‌ చెపుతున్న మాట వాస్తవమే కదా? ఎందుకంటే జగన్, వైసీపీ నేతలు చేస్తున్న ఇవన్నీ కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి కదా?

ADVERTISEMENT
Latest Stories