జగన్‌ మెప్పుకంటే శతృత్వమే మేలు?

Jagan Downfall: Karma in AP Politics

చెడపకురా చెడేవు అని ఊరికే పెద్దలు అనలేదు.. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరెవరిని మానసికంగా, శారీరికంగా, కేసులు విచారణ పేరుతో హింసించారో వారందరూ ఉన్నత పదవులలో ఉన్నారిప్పుడు.

జగన్‌ అండ, ప్రోద్బలంతో రెచ్చిపోయినవారు, ఆయనని మెప్పించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రత్యర్ధులపై రెచ్చిపోయిన వైసీపీ నేతలు, ఉన్నతాధికారులు ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. కొందరు జైళ్ళకు వెళ్ళి వస్తున్నారు కూడా. కానీ నేటికీ వైసీపీ అధినేత జగన్‌తో సహాయ ఆ పార్టీ నేతల నోరు, తీరు మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

అంటే జగన్‌ మెప్పు వలన లబ్ధిపొందిన వారి కంటే ఆయన ద్వేషించిన ప్రతీ ఒక్కరికీ మేలు కలిగిందన్న మాట! ఇంతకీ విషయం ఏమిటంటే, ఆనాడు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేధించినవారిలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి కూడా ఒకరు.

జగన్‌ తనని ఎన్ని రకాలుగా అవమానించినా, వేదించినా ఆయన ఏనాడూ నోరు జారలేదు. ఒక్క ముక్క తప్పుగా మాట్లాడలేదు. మౌనంగా అన్నీ భరిస్తూ చాలా హుందాగా రాజకీయాలు చేశారు.

జగన్‌ చేతిలో అన్ని బాధలు అనుభవించిన ఆయన ఇప్పుడు గోవా గవర్నర్ అయ్యారు. ఆయనని అంతగా అవమానించిన జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో బందీగా ఒంటరి జీవితం గడుపుతున్నారు. చెడపకురా చెడేవు అంటే ఇదే కదా?

జగన్‌ పైశాచిక ఆనందానికి బలైన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రికాగా, అవహేళనకు గురైన పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

జగన్‌ బాధితులైన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శాసనసభ స్పీకర్ కాగా, అరికాళ్ళు వాయగొట్టించుకున్న మాజీ ఎంపీ రఘురామకృష్ణ రావు ఇప్పుడు డెప్యూటీ స్పీకర్ అయ్యారు.

జగన్‌ అవమానించి బయటకు గెంటేసిన మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి వంటివారు, మాజీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారు మళ్ళీ ఇప్పుడు ఆ పదవులలోనే ఉన్నారు. కానీ జగన్‌కి కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదిప్పుడు. చెడపకురా చెడేవు అంటే ఇదేనా?

జగన్‌ వల్ల మేలు, మెప్పు పొందినవారి పరిస్థితి దాయనీయంగా ఉండగా, జగన్‌ నోట అవమానాలు, అవహేళనలు, ఛీత్కారాలు భరించిన వారందరూ ఇప్పుడు సుఖంగా ఉన్నారు.

సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం అంటారు పెద్దలు. సజ్జన సాంగత్యం వలన మనకు మంచి జరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ దుర్జన సాంగత్యం వలన కష్టాలు, అవమానాలు తప్పవని మరోసారి నిరూపితమైంది కదా?

ఏది ఏమైనప్పటికీ జగన్‌ ఇతరులకు అపకారం చేద్దామనుకుంటే వారికి ఉపకారమే జరిగింది. కనుక నేటికీ జగన్‌ బాబా తిట్లు, శాపనార్ధాలు భరిస్తున్నవారి భవిష్యత్‌ మరింత ఉజ్వలంగా ఉండబోతోందని భావించవచ్చు.

హైదరాబాద్‌లో ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ దివాళా తీయడంతో దాని యజమాని చాలా నష్టపోయాడు. కానీ అక్కడ షూటింగ్ చేసిన ఓ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దాదాపు ప్రతీ సినిమా ఆ ఫ్యాక్టరీలో షూటింగ్ చేయడం సెంటిమెంటుగా మారింది. దాంతో అల్యూమియం ఫ్యాక్టరీ నడిపినా రాని లాభాలు షూటింగుల వలన వస్తోంది. ఫ్యాక్టరీ యజమాని దశ తిరిగిపోయింది.

అదే విదంగా జగన్‌ చేత ద్వేషింపబడితే చాలా మేలు కలుగుతుందనే సెంటిమెంట్ వైసీపీ నేతలకి ఇంకా తెలిసి ఉండదు. తెలిస్తే జగన్‌ ఇంటి ముందు క్యూ కడతారేమో?

ADVERTISEMENT
Latest Stories