
ఒక్క ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలలోను ప్రతిపక్షాలు అనేలా కూటమి ప్రభుత్వానికి ఇటు ఏపీలో వైసీపీ అటు తెలంగాణలో బిఆర్ఎస్ రెండు కూడా ఒకటి ప్రత్యక్ష రాజకీయాలతో రెచ్చిపోతుంటే మరొకటి పరోక్ష రాజకీయాలతో రెచ్చగొడుతుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం టార్గెట్ గా వైసీపీ చేస్తున్న జగన్నాటకాలు, అక్కడ బిఆర్ఎస్ వేస్తున్న తారక మంత్రాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి. రాజధాని అమరావతి నుంచి వైసీపీ నేతల అరెస్టుల వరకు వైసీపీ చేస్తున్న రాజకీయం ఏపీ భవిష్యత్ ని భయాందోళనలోకి నెట్టేస్తుంది.
Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్ జీర్ణించుకోగలవా?
ఇక బిఆర్ఎస్ విషయానికొస్తే ఆ పార్టీ తమ రాష్ట్రంలోని అధికార పక్షమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చెయ్యాలన్నా, తమ పార్టీకి రాజకీయ బలం పెంచుకోవాలన్నా, తమ పార్టీ అంతర్గత విభేదాలను పక్క దారి మళ్లించాలన్నా టీడీపీ టార్గెట్ గా ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బిఆర్ఎస్ దృష్టిలో లేని అంశాలను కూడా నేడు తెరమీదకు తెచ్చి కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుంది బిఆర్ఎస్. ఇందుకుగాను ఆ పార్టీ నేతలకు కేటీఆర్ తారకమంత్రాలు ఉపదేశిస్తున్నారు.
Also Read – జగన్ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?
బనకచర్ల నుంచి పట్టిసీమ, పోలవరం ఇలా ఏపీలో బాబు హయాంలో నిర్మిస్తున్న నీటి ప్రోజెక్టుల పై బిఆర్ఎస్ అనవరసపు రాద్ధాంతం చేస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తుంది.
అంటే వైసీపీ హయాంలో ఏపీ నీటి అవసరాల కోసం అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ ఎటువంటి నీటి ప్రోజెక్టుల నిర్మాణానికి ఆసక్తి చూపలేదా.? తమ ఐదేళ్ల విలువైన కాలాన్ని వైసీపీ జగన్నాటకాలతోనే ముగించేసిందా.? వైసీపీ హయాంలో ఏపీ అంశాల మీద లెగవని బిఆర్ఎస్ పార్టీ నేతల నోర్లు ఇప్పుడు ప్రభుత్వాలు మారగానే ఎందుకు లేస్తున్నాయి.?
Also Read – గులక రాయి తగలడం వల్లనే జగన్‌కి మతిమరుపు?
తెలంగాణలో తిరిగి బిఆర్ఎస్ అధికారాన్ని అందిపుచ్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏపీ మీద రాజకీయం చేయడమేనా.? ఇక్కడ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి బాబు నిర్ణయాలను తప్పుబట్టడమేనా.? ఆ దిశగానే బిఆర్ఎస్ అడుగులు వేయాలనుకుంటుందా.? మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చకొట్టి గులాబీ కారుకు జీవం పోయాలని కేటీఆర్ చూస్తున్నారా.?
విభజన గాయాలతో, వైసీపీ పాలనతో కొనఊపిరితో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఇటు ఏపీలో వైసీపీ జగన్నాటకాలు అటు తెలంగాణలో తారక మంత్రాలు అడ్డంకులుగా మారుతున్నాయి. మరి ఈ నాటకాలు, ఆ మంత్రాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోగలవా.?