రాజధానిగా మావిగన్ అంటూ తన ప్లాన్ బి ని ప్రకటించిన వైస్ జగన్ మోహన్ రెడ్డి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ గట్టిగ నడుస్తుంది. ఆయనను ప్రజాశాంతి పార్టీ కెఏ పాల్ తో పోలుస్తూ జగన్ ఒక జోకర్ అంటూ మీమ్స్ వేస్తున్నారు మీమెర్స్.
అయితే ఒకపక్క కట్టడి చెయ్యలేని సోషల్ మీడియాలో జగన్ పై ఈ రకంగా ట్రోలింగ్ జరుగుతుంటే మరోపక్క సొంత చెల్లి షర్మిల మీడియా సాక్షిగా జగన్ ను మావిగన్ జోకర్ గా ప్రకటించి సోషల్ మీడియాకి మరికొంత ఆహారాన్ని అందించారు.
రాష్ట్ర రాజధాని విషయంలో స్పష్టత లేని జగన్ ఆలోచనలు, వైసీపీ విధానాలు ఈ రకంగా విమర్శలు ఎదుర్కొంటున్నా వైసీపీ మాత్రం ఇంకా కళ్లు తెరవలేకపోతుంది. తాజాగా నిన్న తాడేపల్లి ప్యాలస్ లో జరిగిన వైసీపీ పార్టీ సమావేశంలో కూడా జగన్ తన పార్టీ క్యాడర్ కి లీడర్లకు రాష్ట్ర రాజధానిగా మావిగన్ ను ముందుకు తీసుకెళ్ళంటూ దిశానిర్దేశం చేసారు.
ఇక కొంతమంది జగన్ మెప్పుపొందేందుకు ఏకంగా తాడేపల్లి జగన్ ప్యాలస్ ముందు మావిగన్ తోనే ఏపీ అభివృద్ధి అంటూ జగన్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు పెట్టారు. ఇలా వైసీపీ మావిగన్ ప్రచారంతో తగ్గేదెలా అంటూ ముందుకెళ్లడానికి సిద్దమైన ఈ తరుణంలో ఇప్పుడు షర్మిల బహిరంగానే తన అన్నను జోకర్ అంటూ వ్యాఖ్యానించడం వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసులుగా చెప్పుకునే జగన్ ఆయన ఆశయాలను మాత్రం గాలికొదిలేసి కేవలం ఆయన రాజకీయ ఛరిష్మాను, ఆయన పేరును మాత్రమే వాడుకుంటున్నారని, జగన్ నిజంగా వైఎస్ ఐడియాలజి ని అనుకరిస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన మొదలుపెట్టిన జలయఙ్ఞాని పూర్తి చేసేవారని,
వైఎస్ఆర్ తన జీవితకాలం పాటు బీజేపీ ని వ్యతిరేకిస్తూనే వచ్చారు, కానీ ఆయన వారసులం అని చెప్పుకునే జగన్ గారు బీజేపీ కి దత్తపుత్రుడుగా మారిపోయారని, వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అంటూ జగన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.
షర్మిల తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్ విషయంలో దూకుడుగానే ముందుకెళ్తున్నారు. బీజేపీ అంశానికొస్తే మోడీ దత్తపుత్రుడు జగన్ అంటూ నిర్మొహమాటంగా కుండబడ్దలు కొడుతున్నారు, అలాగే తన తండ్రి ఆస్తి పంపకాల వివాదంలో కూడా ఆస్తుల కోసం తల్లిని కోర్టుకీడ్చిన ఘనుడిగా జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి అన్న ఏ చెల్లికి వద్దంటూ వాపోతునే వైసీపీ సోషల్ మీడియా శ్రేణులను కాలకేయ సైన్యంగా అభివర్ణించారు.
ఇక జగన్ కోసం తన పై తన తల్లి విజయలక్ష్మి పై విరుచుకుపడే బ్యాచ్ లను కుక్కలుగా పేర్కొంటూ ఆ తరువాత వీరిని చూసి ఆ కుక్కలు కూడా సిగ్గుపడేలా ఉన్నాయంటూ వైసీపీ నేతలను అత్యంతదారుణంగా అవమానించారు. ఇక ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత జగన్ ను ఉద్దేశించి జోకర్ అంటూ వ్యాఖ్యానించడంతో షర్మిల మీద మతాల యుద్దానికి సాక్షి నుంచి వైసీపీ నేతల వరకు అందరు ముందుకొచ్చేస్తారు.




