మార్గదర్శికి వేధింపులు పెట్టుబడిదారులకు హెచ్చరిక కాదా?

Margadarsi-Chit-Funds-Ramoji-raoరాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపిలో ముఖ్య నేతల ఆర్ధికమూలాలను దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. తన రాజకీయ కక్ష సాధింపును టిడిపికే పరిమితం చేయలేదు.

ADVERTISEMENT

తమ ప్రభుత్వ అసమర్దత, అవినీతి, అక్రమాలను, వైఫల్యాలను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచుతోందనే కక్షతో ఈనాడు మీడియా సంస్థను కూడా దెబ్బతీయడం సాధ్యం కాక రామోజీరావుకే చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థని ఆర్ధికంగా దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఆర్ధికసంస్థలకు నమ్మకమే పునాది. ఆ నమ్మకన్నే దెబ్బ తీసి మార్గదర్శిని కూల్చివేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుంది. మొదట మార్గదర్శి అక్రమంగా ప్రజల నుంచి ఫిక్స్ డిపాజిట్లు సేకరిస్తోందని ఆరోపించింది. ఇప్పుడు మార్గదర్శి చీటీ పాటలలో అక్రమాలు జరుగుతున్నాయని, బలవంతంగా చందాదారులను చేర్పించుకొంటోందని ఉన్నతాధికారుల చేత ప్రెస్‌మీట్‌లు పెట్టి ఆరోపణలు చేయిస్తోంది. తమకు ‘కొంతమంది మార్గదర్శి బాధితులు’ పిర్యాదులు కూడా చేశారని చెపుతూ, దీనికోసం ప్రత్యేకంగా ఓ వాట్సప్ నంబర్ కూడా ఏర్పాటు చేశామని వారు చెప్పారు.

అయితే మార్గదర్శి ఒక్క ఏపీలోనే లేదు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా విస్తరించి ఉంది. మార్గదర్శి పట్ల ప్రజలకు నమ్మకమే లేకపోతే, అది అవకతవకలకు పాల్పడుతున్నట్లయితే ఇన్ని రాష్ట్రాలకు విస్తరించగలిగేది కాదు కదా?అక్కడి ప్రభుత్వాలు ఉపేక్షించి ఉండేవి కావు కదా?కానీ ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే మార్గదర్శిలో అనేక అక్రమాలు, అవకతవకలు కనిపిస్తున్నాయంటే అర్దం ఏమిటి?

ఒకవేళ మార్గదర్శి మోసాలకు పాల్పడుతున్నట్లయితే దాని చందారులు ఈపాటికే పోలీస్ స్టేషన్లకు వచ్చి పిర్యాదులు చేసి ఉండేవారు కదా?కానీ రాష్ట్రం మొత్తం మీద ఎవరో నలుగురు వ్యక్తులు పిర్యాదులు చేశారని చెపుతూ, ఆయా బ్రాంచీల మార్గదర్శి మేనేజర్లపై కేసులు పెట్టి వేధిస్తుండటం గమనిస్తే ఏదో విదంగా మార్గదర్శి ప్రతిష్టని దెబ్బతీసి, దానిపై ప్రజలకు అనుమానం కలిగేలా చేసి ఆ సంస్థను మూయించేయాలనే కపట ఆలోచన కనిపిస్తోంది.

మార్గదర్శి ఎదుర్కొంటున్న ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను చూస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఐ‌టి కంపెనీలు ఎందుకు రావడం లేదో అర్దమవుతుంది. కనీసం తెలుగు సినీ పరిశ్రమ కూడా ఏపీకి రావడానికి భయపడుతోందంటే అర్దం ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వం ఓ వ్యాపారసంస్థ పట్ల ఈవిదంగా వ్యవహరిస్తూ పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సంకేతాలు పంపిస్తోంది?మార్గదర్శితో ఈవిదంగా వ్యవహరిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?

మార్గదర్శిని దెబ్బ తీస్తే ఈనాడు, దాంతో చంద్రబాబు నాయుడు, టిడిపిని దెబ్బతీయవచ్చని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోందే తప్ప, మార్గదర్శి రాష్ట్రానికి ఓ ప్రతిష్ఠాత్మకమైన సంస్థ అని, అది వేలాదిమందికి ప్రత్యక్షంగా, వేలాదిమందికి పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తోందనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఇంత చేసినా ఏపీలో మార్గదర్శిని మూయించి వేయగలదేమో కానీ ఇరుగుపొరుగు రాష్ట్రాలలో దాని బ్రాంచీలను మూయించగలదా? అసలు మార్గదర్శి, ఈనాడు సంస్థలే ఒకదానితో మరొకదానికి సంబందం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నప్పుడు మార్గదర్శి మూతపడితే ఈనాడు ఆగిపోతుందా?అని ఆలోచిస్తే ఇవి ఎంత వెర్రి ప్రయత్నాలో అర్దమవుతుంది.

ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వం పనితీరు గురించి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి. వాటికి కేసీఆర్‌ తన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పధకాలతోనే సమాధానాలు ఇస్తుంటారు తప్ప ఏనాడూ మార్గదర్శిని ఈవిదంగా వేదించ లేదు. ఎందుకంటే మార్గదర్శి ద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం, రాష్ట్రంలో వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయని కేసీఆర్‌ గుర్తించారు కనుక. మరి ఈ ఇంగితం మనకి లేదా?

ADVERTISEMENT
Latest Stories