వైసీపీ అధినేత వైస్ జగన్ చేస్తున్న రాజకీయాలు ఒక్కోసారి కనికట్టు మాయాజాలం మాదిరి కనిపిస్తున్నాయి. కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని తన కనికట్టు విద్యతో మాయం చేసి ప్రేక్షుకుల చేత చప్పట్లు కొట్టించుకుని సంబరపడతాడు మెజీషియన్.

Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్‌ జీర్ణించుకోగలవా?

జగన్ కూడా అదే మాదిరి కళ్ళ ముందు జరిగిన ఘోరాలను, మారణఖాండను ప్రమాదాలుగా, అనారోగ్యాలుగా చిత్రీకరిస్తూ తన పార్టీ మద్దతుదారుల నుండి జై జై లు అందుకుంటూ ఆనంద పడుతున్నారు. ఇందుకు జగన్ పర్యటనలో తాజాగా జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు.

జగన్ కారు కింద పడి ఒక వ్యక్తి ప్రాణాలతో పోరాడుతుంటే, ఆ వ్యక్తిని రక్షించాల్సింది పోయి, ఆ ప్రమాదం తన పర్యటనకు అడ్డంకి కాకూడదు అని సదరు బాధితుడిని రోడ్డుపక్కన పడేసి తన పర్యటనను కొనసాగించింది వైసీపీ.

Also Read – బీజేపీ వాదానికి మూడు పార్టీల మద్దతు…

ఆ ఘటన మొత్తం వీడియో లో రికార్డు అవ్వడం, రాష్ట్రం మొత్తం ఆ దారుణ సంఘటన పై పెదవి విరవడంతో అది రాజకీయ కుట్ర అని, ఇందులో ప్రభుత్వ పెద్దల మీద అనుమానాలున్నాయని, అంబులెన్స్ లోనే ఎదో జరిగిందని ఇలా కంటి ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని కట్టుకథగా మార్చేయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్.

ఇందులో భాగంగా సింగయ్య కుటుంబాన్ని తెరమీదకు తెచ్చిన జగన్ వైసీపీ కి అనుకూలంగా, టీడీపీ కి వ్యతిరేకంగా రాజకీయం చెయ్యడం మొదలు పెట్టారు. అయితే గతంలో కూడా ఇదే మాదిరి వైస్ వివేకా దారుణ హత్యను గుండె పాటుగా చిత్రీకరించేందుకు సిద్ధపడ్డ వైసీపీ చివరికి ఆ నేరం మొత్తం నారా వారి రక్తచరిత్ర అంటూ టీడీపీ జెండాకు పూశారు.

Also Read – మిథున్ రెడ్డి: కోటరీ కట్టుబాట్లు పాటిస్తారా.?


నాడు కూడా వైస్ వివేకా ఒంటి మీద గొడ్డలి వేటులు కంటి ముందు కనిపిస్తున్నా, దానిని తన సాక్షి మాయాజాలంతో గుండె పోటుగా చిత్రీకరించేందుకు సిద్ధపడ్డారు. ఇక నేడు జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోతే దానిని కూడా టీడీపీ ఖాతాలో వేసి కనికట్టు మాయాజాలం చేసేందుకు జగన్ వెనుకాడడం లేదు.