ముఖ్యమంత్రి పదవి అంటే వ్యాపారమా? జగన్!

YS Jaganరాజకీయాలలోకి వచ్చిన ప్రతి వ్యక్తి చెప్పే మొదటి మాట ప్రజలకు సేవ చేయడమే నా బాధ్యత. అయితే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే సేవ మాట అటుంచితే విపక్ష నేతలను వేధించడం, ఓటు వేసిన ప్రజలను సాధించడమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అక్రమ వ్యాపారాలు చేసుకునే వారు, హత్యా రాజకీయాలను ప్రోత్సహించే నేతలు రాష్ట్రాన్ని ఏలుతుంటే ఇక ముఖ్యమంత్రి పదవి ఆయనకు వ్యాపారమే అవుతుంది కానీ బాధ్యత కాలేదని జనసేన నేతలు జగన్ పై విమర్శలు చేశారు.

దొంగకే ఇంటి తాళాలు అప్పగించిన చందంగా బెయిలు మీద ఉన్న ఖైదీకి అధికారాన్ని అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూస్తుంటే జాలి కలుగుతుందని జనసేన లీడర్స్ పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని వ్యాపార ధోరణితో చూసే జగన్, ముఖ్యమంత్రి పదవిని కూడా అదే ఉద్దేశంతో చూస్తున్నట్లుంది. ఏపీ మొత్తాన్ని తన వ్యాపార సామ్రాజ్యంగా మార్చి ఇసుక దందాలా పేరుతో కొనసాగిస్తున్న దోపిడీ,తన సొంత బ్రాండ్లతో ప్రజల ప్రాణాలను అరించే మద్యం వ్యాపారం, మూడు రాజధానుల పేరుతో విశాఖలో చేస్తున్న భూదందాలు,కొండల విధ్వంసాలు, ప్రభుత్వ భూముల స్వాహాలు, కాంట్రాక్టర్ల పేరుతో కమిషన్లు, ప్రోజెక్టుల పేరుతో పంపకాలు…,ఇలా జగన్ కు ప్రతిదీ వ్యాపారమే అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

ADVERTISEMENT

రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా గంజాయి సాగు.., మత్తు పదార్థాలు అమ్మకాలు ఇలా జగన్ వ్యాపార సామ్రాజ్యానికి ప్రజలే పట్టం కట్టారు. చివరకు ఆత్యాత్మిక ధోరణిలో ఉండే తిరుమల పుణ్య క్షేత్రాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. తిరుమల వెంకన్న దర్శనాలకు, సేవలకు, అక్కడి వసతి కేంద్రాలకు చీటీ పాట మాదిరి ధరలు పెంచుకుంటూ సామాన్యుడికి శ్రీవారి సేవలను దూరం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిది కాదా?

వినోదాన్ని ప్రజలకు చేరువచేయాలి అంటూ సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించే సహృదయం కలిగిన జగన్ గారికి దేవాలయాలను వ్యాపార సంస్థలుగా మార్చకూడదు అనే సంస్కారం తెలియదా? ముఖ్యమంత్రి పదవి అంటే ప్రజా ధనానికి కాపలాదారుడు మాత్రమే కానీ ఆప్రజా ఖజానాకు అధిపతి కాలేడు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర సహజ వనరులకు జవాబుదారుడే కానీ వ్యాపారవేత్త కాకూడదు అనే వాస్తవాన్ని జగన్ గుర్తించాలి. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని వ్యాపార ధోరణితో ముందుకెళ్లే నాయకులకు కాకుండా నిజాయితీగా అడుగులు వేసే నేతలను ఎన్నుకోవాలంటూ జనసేన నేతలు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories