జగన్ అరెస్టుకు వైసీపీ సిద్ధం..మరి కేసీఆర్ కోసం బిఆర్ఎస్.?

Jagan and KCR facing legal troubles in Andhra and Telangana politics

ఏపీ లిక్కర్ స్కాం కేసు అరెస్టులు వైసీపీ ముఖ్య నాయకుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి వరకు వచ్చేసాయి. ఇక రేపో మాపో వైసీపీ బిగ్ బాస్ కూడా అరెస్టు కాకా తప్పదు, అధికారులు తాడేపల్లి ప్యాలస్ గేట్లు తెరవక తప్పదు అనే ప్రచారం అటు వైసీపీ లో కూడా ఊపందుకుంది.

అయితే ఈ ప్రచారాన్ని కూడా స్వయానా వైసీపీ కీలక నేతలే, జగన్ నమ్మకస్తులే సజ్జల నుంచి పేర్ని నాని వరకు మీడియా ముఖంగా పార్టీ క్యాడర్ కు పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా, కక్ష్య పూరితంగా లిక్కర్ స్కాం లో జగన్ ను ఇరికించేందుకు కుట్ర చేస్తుందని,

ADVERTISEMENT

అలాగే వైస్ జగన్ ను అరెస్టు చేసేందుకు ప్రణాళికలు వేస్తుందంటూ సొంత పార్టీ నాయకులే మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని పార్టీ అధినేత వైస్ జగన్ తన చర్యలతో బలపరుస్తున్నారు.

ఇలా ఒకపక్క ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పరిస్థితి ఇలా లిక్కర్ బాటిల్స్, డబ్బు కట్టల మధ్య నడుస్తుంటే, మరోపక్క వైస్ జగన్ అరెస్టు ఖాయమనే ప్రచారం పార్టీ క్యాడర్ నుంచి లీడర్ల వరకు సాగుతుంది.

ఇక తెలంగాణ విషయానికొస్తే, ఇక్కడ ఫోన్ టాపింగ్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్టు కావచ్చు అనే సంకేతాలు వెలువడినప్పటికీ, ఎక్కడైనా విలన్స్ చివరిలోనే పట్టుబడతారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించడంతో ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో విలన్ గా భావించే వ్యక్తి కేటీఆర్ కావడంతో ఇంకా ఈ కేసు తుది దశకు చేరలేదా.? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో వ్యక్తమయింది.

ఇప్పుడు తెలంగాణలో తాజాగా ఫోన్ టాపింగ్ కేసు పక్కకెళ్లి కాళేశ్వరం నివేదిక తెరమీదకొచ్చింది. రేవంత్ సర్కార్ నియమించిన పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం అవినీతి, అక్రమాలకు ప్రధాన కారకుడు కేసీఆరే అనే విధంగా కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది.

ఇదిలా ఉంటే కేసీఆర్ పై కక్ష్య సాధించేందుకే రేవంత్ కాళేశ్వరం పై నానా రగడ చేస్తున్నారని, వచ్చే వందేళ్ల తెలంగాణ భవిష్యత్ కోసమే కాళేశ్వరం అంటూ హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎదురుదాడి చేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎటువంటి అవినీతి జరగలేదని, ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు DPR లో పొందుపరిచామని, హై పవర్ కమిటీ సిఫార్సులు, క్యాబినెట్ నిర్ణయం, CWC ఆమోదం మేరకే కాళేశ్వరం నిర్మించామంటూ హరీష్ తన ప్రజంటేషన్ లో వివరించారు.

అయితే ఘోష్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం అవినీతికి కారకులైన వారి పై చర్యలు చేపట్టాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు సమాచారం. అదే విధంగా ఈ అంశం పై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి గత ప్రభుత్వ అక్రమాలు, కేసీఆర్ అవినీతిని ప్రజలను తెలియపరచాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తుంది.

బిఆర్ఎస్ ఓటమి నుంచి నేటి వరకు ఫేమ్ హౌస్ గడప దాటని, అసెంబ్లీ ముఖం చూడని కేసీఆర్, తన మీద పడిన కాళేశ్వరం అవినీతి మరక తుడుచుకోవడానికి, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పడానికి అసెంబ్లీకి వస్తారా.?

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారా.? లేక న్యాయస్థానాలతో పోరాటానికి మొగ్గు చూపుతారా.? అన్న అనేక ప్రశ్నలు ఇప్పుడు గులాబీ బాస్ ను వెండతున్నాయి. ఈ పరిస్థితులలో కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసే సాహసం చేస్తుందా.? అందుకు బిఆర్ఎస్ సిద్ధంగా ఉందా.? అన్న ప్రశ్నలు గులాబీ జెండాను కలవపరుస్తున్నాయి.

జగన్ అరెస్ట్ విషయంలో వైసీపీ తన చర్యలతో, భవిష్యత్ లో ఏమైనా జరగొచ్చు అనే నాయకుల సంకేతాలతో తన పార్టీ క్యాడర్ ను లీడర్లను ముందుగానే సిద్ధం చేస్తుంది. కానీ బిఆర్ఎస్ కేసీఆర్ విషయంలో ఎం జరుగుతుంది.? భవిష్యత్ లో ఎం జరిగే అవకాశం ఉండబోతుంది అన్న విషయాల పై పార్టీ క్యాడర్ కు గాని లీడర్లకు కానీ ఎటువంటి సంకేతాలు ఇవ్వలేకపోతుంది.

ADVERTISEMENT
Latest Stories