మావిగన్‌.. రాగం తెలుసుకోకుండా తాళం వేస్తే ఇంతే!

Jagan Mavign controversy

లేడికి లేచిందే పరుగు అన్నట్లు వైసీపీ అధినేత జగన్‌ బుర్రలో మావిగన్‌ బీజం పడగానే ‘వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్’లా కొన్ని గంటల వ్యవధిలోనే వట వృక్షంగా ఎదిగిపోయింది. దానిపై వైసీపీ చిలుకలన్నీ వాలిపోయి మావిగన్‌ పాట ఆలపిస్తున్నాయి.

‘అమరావతి రాజధానిగా మాకు అంగీకారం కాదు,’ అని జగన్‌ ‘మావిగన్‌’ తో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడంతో, ఆయనకు ఇప్పటికైనా రాజధాని విషయంలో మంచో చెడో… ఓ స్పష్టత వచ్చిందని అందరూ సంతోషిస్తున్నారు.

ADVERTISEMENT

కానీ అయన కళ్ళలో ఆనందం చూడాలనుకునే గుడివాడ అమర్నాథ్ వంటివారు అయన మనసులో ఏముందో అర్థం చేసుకోకుండా మావిగన్‌పై సొంత కవిత్వం చెపుతూ ఇంకా గందరగోళం సృష్టిస్తున్నారు.

ఈరోజు అయన మీడియాతో మాట్లాడుతూ, “మేము అమరావతిని ఏనాడూ వ్యతిరేకించలేదు. నిజానికి మావిగన్‌ అంటే అమరావతితో కూడిన మూడు నగరాలే కదా?కానీ సిఎం చంద్రబాబు నాయుడు మాకు మావిగన్‌ వద్దు అమరావతే కావాలంటే మేమేం చేయగలం?” అని గుడివాడ గుడ్డు పగలగొట్టి మరీ చెప్పారు.

నిజానికి 2016లో చేసిన సీఆర్‌డీఏ చట్టంలోనే అమరావతి పరిధిలో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కూడా ఉన్నాయి. కానీ 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆయనకు తెలియకపోతే వైసీపీలో మంత్రులుగా చేసినవారు చాలా మందే ఉన్నారు. ఎవరో ఒకరు చెప్పొచ్చు. కానీ వారెవరికీ చెప్పే ధైర్యం లేదు. పైగా ఎవరినీ సంప్రదించకుండానే జగన్‌ మావిగన్‌ అనేశారు. కనుక తప్పో ఒప్పో అధినేతని వెనకేసుకురాక తప్పదు. కనుక అందరూ మావిగన్‌ పాట అందుకున్నారు.

సీఆర్‌డీఏ చట్టం ప్రకారం అమరావతి పరిధిలో మావిగన్‌ ఉందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి పిచ్చి వాదనలు చేయకూడదు కదా?

అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెపుతున్నప్పుడు మళ్ళీ మావిగన్‌ అనడడం దేనికి? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నందునే వైఎస్ షర్మిల సైతం అన్నని బఫూన్ అంటున్నారు కదా?

Latest Stories