
సింగయ్య మృతి కేసులో జగన్ కోర్టులో క్వాష్ పిటిషన్ వేయడమే తొందరపాటు అనుకుంటే, సింగయ్య భార్య, కుటుంబ సభ్యులను తాడేపల్లి ప్యాలస్‌కు పిలిపించుకొని వారి చేత “అంబులెన్సులో సింగయ్యని హత్య చేసి ఉండవచ్చు,”అని ఆరోపణ చేయించడం మరో పొరపాటు.
సింగయ్య తన కారు కింద పడినప్పుడు, ఆయనని వెంటనే ఆస్పత్రికి తరలించకుండా జగన్ అలసత్వం ప్రదర్శించారే తప్ప ఆయనని హత్య చేయలేదు. అప్పుడు కారుని ఆయన డ్రైవ్ చేయడం లేదు కూడా. కనుక ప్రమాదవశాత్తు సింగయ్య చనిపోయినందున జగన్ అరెస్ట్ భయంతో ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.
Also Read – కోటా శ్రీనివాసరావు ఇక లేరు
కానీ ఈ కేసులో పోలీసులు తనని ఏ-2గా పేర్కొనగానే అరెస్ట్ భయంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి రెండు వారాలు గడువు సంపాదించుకున్నారు.
అంతటితో ఊరుకున్నా ఆ కేసు విచారణ దానంతట అదే సాగి ముగిసేది. కానీ జగన్ అరెస్ట్ భయంతో లేదా దీనిపై కూడా శవ రాజకీయాలు చేయవచ్చనే దూరాలోచనతోనో సింగయ్య భార్య, కుటుంబ సభ్యులను తాడేపల్లి ప్యాలస్‌కు పిలిపించుకొని వారి చేత ఈ ఆరోపణ చేయించారు. వారు జగన్ సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు కనుక ఆయన ఒత్తిడి లేదా ప్రలోభపెట్టినట్లు అనుమానించాల్సి ఉంటుంది.
Also Read – మెడలో గులాబీ కండువా లేకపోతే కవితైనా జీరోయేనా?
ఒకవైపు ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతుంటే, మరో పక్క జగన్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు, కేసు విచారణని ప్రభావితం చేసే విదంగా బాధితుల చేత మాట్లాడించి జగన్ మరో పొరపాటు చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు వల్లభనేని వంశీ ఏవిదంగా టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్య వర్ధన్‌ని కిడ్నాప్ చేసి బెదిరించి, భయపెట్టి కేసు ఉప సంహరించుకునేలా చేశారో, ఆదేవిదంగా జగన్ కూడా సింగయ్య భార్య చేత స్టేట్‌మెంట్ ఇప్పించారు. ఆ కేసులో మాదిరిగానే ఈ కేసులో కూడా పోలీసులు జగన్‌పై మరో కేసు నమోదు చేస్తారా?
Also Read – ఆ రెండు పార్టీలు గోదావరికి బిందెలు అడ్డం పెట్టొచ్చుగా?