ఎన్నికల సమయంలో జగన్ తలకు గులకరాయి తగలడం వలన గతం మరిచిపోయినట్లున్నారు. అందుకే ప్రెస్‌మీట్ పెట్టి ఏదేదో మాట్లాడేస్తున్నారు.
జగన్ ఇవాళ్ళ తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఏపీ ప్రజలకు తెలియని కొన్ని విషయాలు బయటపెట్టారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. శాంతి భద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.
చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి పెట్టకుండా ‘పొలిటికల్ గవర్నెన్స్’ మీద దృష్టి పెట్టి రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షపార్టీ వైసీపీ.. నేతలపై తప్పుడు కేసులతో వేధిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వైసీపీ ప్రశ్నించాల్సివస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రజలను, రైతులను పట్టించుకోకపోవడం లేదు. కనుక రాష్ట్రం ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ నా దగ్గరకే వస్తున్నారు.
కనుక నేను వారి సమస్యలపై పోరాటం మొదలుపెట్టగానే నన్ను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు శత విదాల ప్రయత్నిస్తున్నారు. కానీ నన్ను అడ్డుకోవడం ఆయన వలన కాకపోవడంతో నేను చెప్పిన సమస్యలని పరిష్కరించక తప్పడం లేదు…” అని జగన్ టూకీగా చెప్పేశారు.
గులకరాయి తగిలినప్పటికీ జగన్‌కు తాను ఏపీకి ముఖ్యమంత్రిగా చేశాననే విషయం బాగానే గుర్తుంది కానీ ఆ 5 ఏళ్ళలో తన అరాచక పాలన జగన్‌కి గుర్తులేదు.
చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి మానసికంగా క్రుంగిపోయేలా చేస్తే టీడీపీని తుడిచి పెట్టేయవచ్చనుకున్న విషయం, ఆ కారణంగానే తనను ప్రజలు తిరస్కరించారనే విషయం జగన్ మరిచిపోయారు కానీ ఈవీఎంల వల్లనే ఓడిపోయాననే విషయం బాగా గుర్తుంది.
తన వేధింపులు భరించలేక డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం, డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో చనిపోవడం, తమ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు అరికాళ్ళు వాచిపోవడం వంటివన్నీ జగన్‌కు గుర్తులేకపోవడానికి కారణం ఆ మతిమరుపు వ్యాధే.
కనుకనే ఇప్పుడు వైసీపీ నేతల కేసులు, అరెస్టులు అన్యాయం, అక్రమం అని వాదిస్తున్నారు. గులకరాయి దెబ్బకి వచ్చిన ఈ మతిమరుపు వల్లనే వర్తమాన రాజకీయాలలో తాను ఆణిముత్యమని జగన్ గట్టిగా నమ్మగలుగుతున్నారు!
అంత గట్టిగా నమ్ముతుండబట్టే తాను అద్భుతంగా రాష్ట్రాన్ని పాలించానని, ప్రజలకు ఎంతో మేలు చేశానని జగన్ చాలా నమ్మకంగా చెప్పుకోగలుగుతున్నారు. కనుక ఈ రాజకీయ మతిమరుపు చాలా మంచిదే.. అవసరమే.
కనుక జగన్ చెప్పిన ఈ సమస్యలన్నీటికీ ఏకైక పరిష్కారం ప్రజలు మళ్ళీ వైసీపీని గెలిపించి తనని ముఖ్యమంత్రిని చేసుకోవడమే.
కానీ ఇక్కడో సమస్య ఉంది! ఈవీఎంలతో గెలవడం కష్టమని జగన్ పదేపదే చెపుతున్నారు. కానీ 2029 ఎన్నికలు కూడా ఈవీఎంలతోనే జరుగుతాయి.
కనుక 2024 ఎన్నికలలో ఈవీఎంలతో ఓడిపోయామనే విషయం మరిచిపోక తప్పదు. మారిచిపోయినట్లే ఉన్నారు. అందుకే ఈసారి ఎన్నికలలో మనమే తప్పకుండా గెలుస్తాం అని చెపుతున్నారనుకోవచ్చు.
కొందరు దర్శకులు తమ సినిమా పేరుతో సహా అన్నీ గోప్యత పాటిస్తూ సినిమాలు తీస్తుంటారు. ఈ కారణంగా ఆ సినిమాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేక అభిమానులు లేదా సోషల్ మీడియా ఏవేవో ఊహించి చెప్పుకొని సంతోషపడుతుంటారు.
వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుపు ఖాయమని జగన్ ఎలాగూ తేల్చి చెప్పేస్తున్నారు కనుక ఈసారి ఎన్నికలలో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడే చెప్పేసి వైసీపీలని సంతోష పెట్టవచ్చు కదా.. నిరుడులా?
ఏది ఏమైనప్పటికీ కళ్ళు మూసుకుంటే గిర్రున తిరిగే 5 ఏళ్ళపాటు సంతోషంగా జీవించేందుకు తోడ్పడుతున్న ఈ మతిమరుపు మంచిదే!
చివరిగా ఒక మాట! జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రతిపక్షాలు వంటి పదాలు మారిచిపోయారు. కానీ ఇప్పుడవన్నీ గుర్తొచ్చేశాయి. ఇలా కొన్ని విషయాలు మరిచిపోతూ, కొన్ని గుర్తుంచుకొని జగన్ రాజకీయాలు చేస్తుంటే ఈయనతో ఎలా వేగేదబ్బా?




