రాహుల్ ను టచ్ చేయడమంటే షర్మిలను నిద్ర లేపడమే అనే విషయాన్ని వైసీపీ అధినేత వైస్ జగన్ మరిచినట్టున్నారు. పడుకున్న పులిని నిద్ర లేపి మరి తన్నించుకున్నట్టు, పులివెందుల ఉపఎన్నికల విషయంలో స్తబ్దుగా ఉన్న వైస్ షర్మిలను జగన్, రాహుల్ గాంధీ మీద విమర్శలతో నిద్రలేపారు.
ఇక ఆ తరువాత వైసీపీ పై షర్మిల వేట ఎలా ఉండబోతుందో, వైస్ జగన్ కు ఎటువంటి ప్రశ్నలతో కౌంటర్లు వేయనుందో ఆ జగన్ కూడా ఊహించలేరు, వైసీపీ నేతలు సైతం సమాధానం చెప్పలేరు.
ఇటు బీజేపీ ఎన్డీయే లో భాగంగా ఉంటూ మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో బాబు హాట్ లైన్ లో ఉన్నారు అంటూ పులివెందుల పంచాయితీలోకి రాహుల్ ను లాగారు పులివెందుల ఎమ్మెల్యే జగన్. ఇక తమ అధినేత మీద విమర్శలు చేస్తే షర్మిల ఊరికినే ఉంటుందా.?
జగన్ మాదిరి షర్మిలకు స్క్రిప్ట్ పేపర్ అవసరం లేదు, వైసీపీ నేతల లెక్క అధినేత నుంచి ఆదేశాలు అవసరం లేదు. షర్మిలకు బీపీ వస్తే చాలు వైసీపీ కి చమటలు పట్టడం ఖాయం అనేట్టుగా వైసీపీ కోట రహస్యాల నుంచి జగన్ ప్యాలస్ రాజకీయాల వరకు నీలి రంగు జెండా గుట్టు మొత్తం షర్మిల గుప్పెట్లో ఉంటుంది.
ఒక్కసారి షర్మిల ఆ పులివెందుల ఏకగ్రీవాల రాజకీయం గుట్టు విప్పితే వైసీపీ భవిష్యత్ గతం మరచిన గజని మాదిరి తయారవుతుంది. ఇప్పటికే సునీత ఒకపక్క వైసీపీ ని జలగ మాదిరి పట్టిపీడిస్తోంది. ఇక ఇప్పుడు జగన్, రాహుల్ తో కయ్యానికి కాలు దూస్తే షర్మిల వైసీపీ పై కత్తులు దూస్తుంది.






