నేడు నెలూరు జిల్లా పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ తన పార్టీ సౌమ్యులను ఓదార్చారు, అందగాళ్ళను పరామర్శిచారు. ముందుగా అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై జైలుకెళ్లిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకెళ్లి ఓదార్చిన జగన్,
అటు పిమ్మట కొవ్వూరు టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కున్న నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.
అంటే జగన్ ఒక అక్రమానికి వంత పాడుతూ, ఒక అరాచకానికి కొమ్ము కాస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలకు చోటు లేని పరిస్థితుల నుంచి వ్యక్తిగత జీవితాల పై రాజకీయం చేసే వాతావరణాన్ని వైసీపీ ప్రారంభించి, పెంచి పోషిస్తుంది.
అందులో భాగంగానే అన్నట్టుగా మహిళల మీద వారి ఆత్మ గౌరవం మీద నీచ విమర్శలు చేసిన వారికీ జగన్ పరామర్శ పేరుతో ప్రోత్సహకాన్ని అందిస్తున్నారు. నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి పై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను చిరునవ్వుతో స్వాగతించిన జగన్, నేడు తన ఓదార్పుతో నల్లపురెడ్డి నీచ రాజకీయాన్ని బలపరిచారు.
అయితే దాని ఫలితం నేడు వల్లభనేని వంశీ అనుభవించారు. వైసీపీ విధానాలకు తలొగ్గి వైస్ జగన్ ఆదేశాలను అనుసరిస్తూ గత ఐదేళ్లు టీడీపీ మీద బాబు కుటుంబం మీద రెచ్చిపోయిన వంశీకి చివరికి చిప్పకూడు తప్పలేదు.
దాదాపు నాలుగు నెలల పాటు జైలు జీవితం అనుభవించిన వంశీ మొన్నఈమధ్య బెయిలు మీద బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో వైస్ జగన్ వంశీని అతని కుటుంబాన్ని తాడేపల్లి ప్యాలస్ కు పిలిపించుకుని పరామర్సించారే తప్ప ప్రసన్న మాదిరి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించలేదు, ఓదార్చలేదు.
అలాగే తాజాగా జగన్ కారు కింద పడి మరణించిన సింగయ్య అనే వైసీపీ కార్యకర్త పట్ల కూడా జగన్ ఇదే మారింది వ్యవహరించారు. బాధితులను తన ప్యాలస్ కు రప్పించుకుని వారి చేతికి ఒక స్క్రిప్ట్ పేపర్ ఇచ్చి సింగయ్య మరణానికి తనకు ఎటువంటి సంబంధం లేదు అనేలా బాధితు కుటుంబ సభ్యుల నోటే చెప్పించారు.
జగన్ కు సింగయ్య మరణానికి సంబంధం లేకుంటే వారి కుటుంబానికి వైసీపీ పార్టీ తరుపున 10 లక్షల రూపాయిల ఆర్థిక సాయం జగన్ ఎందుకు చేసినట్టు.? ఇక తన చర్యలతో జగన్ వీర భక్తుడిగా పేరుపొందిన కొడాలి నాని విషయంలో కూడా జగన్ పట్టీపట్టనట్టే వ్యవహరిస్తున్నారు.
గత ఐదేళ్లు గుడివాడ ఎమ్మెల్యే గా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా కంటే కూడా బూతుల మంత్రిగా ఎక్కువ పేరు పొందిన కొడాలి నాని, కూటమి ప్రభుత్వ రాకతో అజ్ఞాతంలోకి వెళ్లారు, ఆ పై గుండె ఆపరేషన్ అంటూ రాష్ట్రాన్ని వీడారు.
అయితే తిరిగి తన నియోజకవర్గానికి వచ్చిన కొడాలిని పరామర్శించేందుకు ఆయన కుటుంబాన్ని ఓదార్చేందుకు జగన్ గుడివాడ వెళ్ళలేదు ఎందుకు.? కూటమి రాకతో, గుడివాడలో టీడీపీ విజయంతో కొడాలి గుడివాడలో అడుగు పెట్టేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారు.
అటువంటి కొడాలిని ఓదార్చేందుకు జగన్ కు మనసు రాలేదా.? అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా అంచి స్నేహితులు, ఇద్దరు కూడా టీడీపీ పార్టీని వీరుడి వైసీపీ ని చేరినవారే, అలాగే ఈ ఇద్దరు నాయకులు కూడా బాబు సామాజికవర్గానికి చెందిన నేతలే.
వైసీపీ పభుత్వ హయాంలో బాబు ని దూషించేందుకు, లోకేష్ ని కించపరిచేందుకు, వారి కుటుంబంలోని మహిళలను అగౌరవపరిచేందుకు, టీడీపీ మీద విషం చిమ్మేనందుకు వీరిని వాడుకున్న జగన్ ఇప్పుడు కష్ట సమయంలో మాత్రం తన కులాభిమానాన్ని చూపిస్తున్నారా.?
అంటే జగన్ కేవలం తన రెడ్డి సామాజికవర్గ నేతల ఇంటికి మాత్రమే వెళతారా.? వారి కుటుంబాలను మాత్రమే పరామర్శిస్తారా.? మిగిలిన సామజిక వర్గ నాయకులంతా తమ స్వామి భక్తి చూపినప్పటికీ వీరి పై వీరి కుటుంబాల పై జగన్ ఎప్పటికి సీతకన్నే వేస్తారా.? అన్న అనేక ప్రశ్నలు జగన్ ఓదార్పు యాత్రలను వెంటాడుతున్నాయి.






