ఇంట్లో ఈగల మోత..బయట పల్లకి మోత..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే “ఇంట్లో ఈగల మోత బయట పల్లకి”ల మోత అన్న సామెత సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ కి ఎదుర్కుంటున్న రాజకీయ సంక్షోభానికి, వైస్ జగన్ కు ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడికి పార్టీని తిరిగి నిలబెట్టడం ఎలా అన్న ఆలోచన సగటు వైసీపీ అభిమాని మెదడును తొలిచేస్తుంది.

ఒక పక్క పార్టీ సీనియర్ నాయకులు, వైస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి జగన్ నుంచి సైడ్ అవుతున్నారు. విజయసాయి రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి వైస్సార్ విధేయులు ఈ కోవలోనే జగన్ చెర నుంచి బయటకు వచ్చారు.

ADVERTISEMENT

ఇక వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ లు కూడా ఒక్కొక్కరుగా రాజీనామా బాట పడుతున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ ల రాజీనామాలతో ప్రస్తుతం ఏపీ శాసనమండలి లో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీ ల సంఖ్య 5 కి చేరింది. ఇక శాసనమండలి లో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్న బొత్స కూడా త్వరలో పార్టీ మారబోతున్నారు అనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.

ఇక ఆ పార్టీలోని మాజీ మంత్రులంతా గత ఐదేళ్ల తమ పాపాలు కేసులు రూపంలో భయపెట్టడంతో ఇంటి గడప దాటలేని పరిస్థితిలో మాకు ఇక రాజకీయ భవిష్యత్ లేదా గోవిందా అంటూ బిక్కుబిక్కుమంటూ కళ్ళు మూసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇక వైసీపీ లోని అందగాళ్ళు, సౌమ్యులు ఒక్కొక్కరుగా జైలు బాటపట్టడంతో దాదాపుగావైసీపీ వేసవికి ఎండిన ఊటబావి మాదిరి ఖాళీ అవుతుంది.

ఇది చాలదు అన్నటుగా ‘గోరు చుట్టు మీద రోకలి పోటు’ అన్న చందంగా ఇటు వైస్ షర్మిల, అటు సునీత చెరో పక్క జగన్ కు ఇంటి పోరు రుచి చూపిస్తూ ఊపిరాడకుండా చేస్తున్నారు. ఇక తల్లి విజయలక్ష్మి ఇప్పటికే జగన్ ఆయన సతీమణి భారతి మీద కోర్టులో కేసులు వేస్తూ వైసీపీని ఎప్పటికప్పుడు రాజకీయ ఇరకాటంలో పడేస్తున్నారు. ఇలా ఇంటి చుట్టూ ఈగల మోత మాదిరి సమస్యలు ఒకదాని మీద ఒకటి జగన్ ను చుట్టూ ముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కానీ జగన్ ఏదైనా కారణంతో అంటే అది చావు పలకరింపులు కావచ్చు, పెళ్లి ఆశీర్వచనం కావచ్చు, ఓదార్పు కావచ్చు, నిరసన కావచ్చు, లేదా జగన్ బెంగళూర్ యాత్రలు కావచ్చు, లేకుంటే జైలుకెళ్లిన వైసీపీ నేతల పరామర్శలు కావచ్చు ఇలా జగన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన ఛరిష్మా తగ్గలేదు, ఆయన క్రెజ్ లో ఎటువంటి మార్పు రాలేదు అనేలా జై జగన్, జై జగన్ అంటూ వైసీపీ శ్రేణుల నినాదాలు, సీఎం సీఎం అంటూ జగన్ ను పల్లకి ఎక్కిస్తున్న తీరు అందరికి అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తే అక్కడ జగన్ తో కలిపి పట్టుమని పదిమంది పార్టీ ముఖ్య నాయకులు కనిపించని పరిస్థితులలో జగన్ అడుగు బయటపెడితే మాత్రం వేలాది గా అభిమానుల పేరుతో జనం ఎక్కడి నుంచి వస్తున్నారు.? అనే ప్రశ్న అందరి మదిలోను కలుగుతుంది. అయితే ఇందుకు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ ఐప్యాక్ రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్నకు జవాబు ఇట్టే దొరుకుతుంది సుమీ..!

ADVERTISEMENT
Latest Stories