ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన చాలా వేడివేడిగా సాగుతోంది. అయితే అటు బిజెపితో కలిసి సాగుతూ, ఇటు టిడిపి వైపు చూస్తున్న ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని, ముఖ్యమంత్రినవుతానని మాట్లాడటంలో వ్యూహం ఏమిటనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
Also Read – జమ్ము కశ్మీర్‌కి ప్రజా ప్రభుత్వాలు పనికిరావేమో?
పవన్ కళ్యాణ్ మాటల్లో రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. 1. రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతోంది. 2. వైసీపీ నేతల అరాచకాల గురించి మాట్లాడుతుండటం.
రాష్ట్రంలో జనసేన అధికారంలోకి రావాలంటే ఒంటరిగా లేదా వేరే పార్టీతో కలిసి కనీసం 90 సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. కానీ రాష్ట్రంలో జనసేనకు 30 స్థానాలలో మాత్రమే గెలిచే అంత బలముందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెపుతున్నారు. అంటే మిగిలిన 60 సీట్లు మిత్రపక్షం గెలవాల్సి ఉంటుందన్న మాట!
Also Read – తెలంగాణలో కూడా సేమ్ సేమ్!
రాష్ట్రంలో బిజెపికి అంత సీన్ లేదు కానీ టిడిపికి ఉంది. కనుక పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకోబోతున్నారనుకొంటే, అప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకొన్న టిడిపికే ముఖ్యమంత్రి దక్కుతుంది తప్ప జనసేన కాదు కదా? కానీ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తానని, ముఖ్యమంత్రినవుతానని నమ్మకంగా చెపుతున్నారు.
అంటే టిడిపి, బిజెపి, జనసేన మూడు పార్టీలు ఈవిదంగా ఓ అవగాహనకు వచ్చాయా?పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి కలిసి పోటీ చేయబోతున్నాయా?అనే సందేహం కలుగుతోంది. పవన్ కళ్యాణ్ ఈవిదంగా చెపుతున్నప్పటికీ టిడిపి, బిజెపి నేతలెవరూ స్పందించకపోవడమే ఈ అనుమానానికి కారణం.
Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించిన కొద్ది రోజులకే విశాఖ వైసీపీ ఎంపీ ఈవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కొందరు దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ప్రతిపక్షనేత పవన్ కళ్యాణ్ తనకు ‘ప్రాణహాని’ ఉందని, తనను లేపేసేందుకు సుపారీ గ్యాంగులను దింపారని పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను తేలికగా కొట్టిపారేయలేము.
కాకినాడ అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు పెట్టి మరీ హెచ్చరించారు. ఆయన గూండాలను మెయింటెయిన్ చేస్తూ ప్రజలను, ముఖ్యంగా జనసేన కార్యకర్తలను, వీర మహిళలను బెదిరిస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన పనిపడతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
దానికి వైసీపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎదురుదాడి చేయవచ్చు. కానీ వైసీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, పవన్ కళ్యాణ్ ద్వారా వారిని గాడిన పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. లేకుంటే కేవలం 30 సీట్లు మాత్రమే గెలుచుకోగలమని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఇంత ధైర్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని అనలేరు. వైసీపీ నేతల ఆరాచకాల గురించి ఇంత గట్టిగా మాట్లాడేవారు కారు కదా? కనుక తెర వెనుక ఏదో జరిగింది. వచ్చే ఎన్నికలలో ఏదో జరుగబోతోంది.