పెద్ది థ్యాంక్యూ మీట్: కనిపించని, వినిపించని జాన్వీ

Janhvi Kapoor Missing From Peddi Thank You Meet

ప్రీమియర్ షోస్ నుండి జాన్వీ కపూర్ క్యారెక్టర్ విషయంలో జరిగిన రచ్చ తర్వాత “పెద్ది” ఈవెంట్స్ కి జాన్వీ హాజరు కావడం కష్టం అనే క్లారిటీ అందరికీ ఉంది. ఆ విషయం ఇవాళ హైదరాబాద్ లో జరిగిన థ్యాంక్యూ మీట్ తో క్లియర్ అయ్యింది.

అయితే.. ఈవెంట్ కు హాజరైన వారెవరూ కనీసం ఫార్మాలిటీకైనా జాన్వీ పేరు ప్రస్తావించలేదు. ఆఖరికి చరణ్ కూడా జాన్వీకి థ్యాంక్స్ లాంటిది ఏమీ చెప్పలేదు. బుచ్చిబాబు, జగపతిబాబు, సతీష్ కిలారు, మైత్రి రవి, శశి ఇలా అందరూ స్ట్రాటజిక్ సైలెన్స్ పాటించారు.

ADVERTISEMENT

అయితే.. అందుకు జాన్వీ బిహేవియర్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. సినిమా విడుదలైనప్పటినుండి టీమ్ ఫోన్స్ అస్సలు ఆన్సర్ చేయలేదు జాన్వీ, తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా కనీసం ఒక్క స్టోరీ కూడా పోస్ట్ చేయలేదు. ఆఖరికి బుచ్చిబాబు పబ్లిక్ అపాలజీ స్టేట్మెంట్ రిలీజ్ చేశాక కూడా జాన్వీ రెస్పాండ్ అవ్వటపోవడం అనేది గమనార్హం. ఇంతలా ఆమెను అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా జాన్వీ ఖాతరు చేయకపోవడంతో పెద్ది టీమ్ కి కూడా చిరాకొచ్చింది. దాంతో ఆమెను లైట్ తీసుకున్నారు. అందువల్ల.. ఈవెంట్ బ్యాగ్రౌండ్ స్క్రీన్స్ లో ఏదో నామమాత్రానికి జాన్వీ పోస్టర్స్ కనిపించాయి తప్పితే.. ఆమె కనిపించలేదు, ఆమె పేరు వినిపించలేదు.

మరి ఈవారాంతంలో వైజాగ్ లో ప్లాన్ చేయనున్న సక్సెస్ మీట్ లో అయినా జాన్వీ ప్రస్తావన ఉంటుందో లేదో చూడాలి. అయితే.. జాన్వీ ఇలా బిహేవ్ చేయడం అనేది ఆమెను టాలీవుడ్ మరో సినిమాకి కన్సిడర్ చేయడానికి అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదు.

ADVERTISEMENT
Latest Stories