90 లలోనే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక కథానాయిక వెండి తెర దేవకన్య శ్రీదేవి. ఆమె వారసత్వాన్ని అందుకుని సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తన నటనతో కన్నా కాంట్రవర్సి లతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారని చెప్పాలి.
మొదట్లో బాలీవుడ్ కే పరిమితమైన ఈ అమ్మడు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ పై ద్రుష్టి పెట్టింది. తన తల్లి శ్రీదేవి సౌత్ ఇండస్ట్రీ నుంచి వెళ్లి బాలీవుడ్ లో చక్రం తిప్పితే జాన్వీ కపూర్ మాత్రం బాలీవుడ్ నుండి సౌత్ వైపుకి వస్తున్నారు. ఆ నాటి సినీ సెలబ్రేటిస్ నుంచి ఇప్పటి తరం ఇండస్ట్రీ వారికీ కూడా శ్రీదేవి తమ అభిమాన నటిగా ఉన్నారంటే అది అతిశయోక్తికాదనే చెప్పాలి.
కానీ,బాలీవుడ్ లో కూడా జాన్వికపూర్ తన తల్లి అందుకున్న స్టార్ స్టేటస్ అందుకోలేకపోయారు. తెలుగు సినిమా స్థాయి బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి విస్తరించడంతో అక్కడి స్టార్స్ సైతం తెలుగు సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఆ కోవలోకే జాన్వికపూర్ కూడా జూ.ఎన్టీఆర్, కొరటాల మూవీ అయిన దేవర సినిమాతోతెలుగు ఇండస్ట్రీకి హీరోహిన్ గా అడుగుపెట్టారు. ఇదే ఈ అమ్మడి మొదటి తెలుగు, సౌత్ ఇండియా మూవీ. దేవర మూవీలో నేను నటన అంటే ఏంటో తెలుసుకున్నాను అంటూ చెప్పిన జాన్వీ ఇప్పుడు మరో సౌత్ ఫిల్మ్ పై సంతకం చేయబోతున్నారని సమాచారం.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్, తమిళ స్టార్ హీరో సూర్య తో తానూ తీయబోయే పాన్ ఇండియా సినిమాలో సూర్య సరసన జాన్వీ కపూర్ ను ఎంపిక చేసారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తి అయ్యాయని, జాన్వీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందంటూ సమాచారం.
అటు ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర, ఇటు సూర్య తో చేయబోతున్న మూవీ కూడా పాన్ ఇండియా మూవీస్ కావడంతో తన కెరియర్ ను జాన్వీ గట్టిగానే ప్లాన్ చేస్తుందని, తన తల్లి శ్రీదేవి మాదిరే జాన్వీ కూడా అన్ని భాషలలో నటించి సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటూ శ్రీదేవి అభిమానులతో పాటు ఆమె అభిమానులు కూడా విషెస్ తెలుపుతున్నారు.




