పెద్ది గురించి ఎవరికైనా భిన్నాభిప్రాయాలున్నాయేమో కానీ అచ్చియమ్మ గురించి అందరిదీ ఏకాభిప్రాయమే. ఆ సినిమాతో సంబంధమే లేని పాత్ర అది.
ఆమె అందాల ఆరబోత దేనికో అర్థం కాదు. ఒకవేళ సెన్సార్ బోర్డు పెద్దిలో ఆమె పాత్రని పూర్తిగా తీసేసినా పెద్దికి ఎంతో కొంత లాభమే తప్ప నష్టం లేదు.
పెద్దిలో శ్రుతీ హాసన్‌కి ఎంత ప్రాధాన్యం ఉందో ఆమెకీ అంతే ఉందని చెప్పవచ్చు. ఇలా ఆమె పాత్ర గురించి చాలా కామెంట్స్ వచ్చాయి.
పెద్దికి బాగా హైప్ ఏర్పడినందున ఈ ఒక్క సినిమాతో తాను ఎక్కడికో చేరుకుంటానని జాన్వీ కపూర్ అనుకొని ఉండవచ్చు. కానీ బుచ్చిబాబు మాయలో పడి అందాలు ఆరబోసేసినా తగిన గుర్తింపు ప్రాధాన్యం దక్కలేదని ఆమె బాధ పడ్డారని ఎవరో బాధ పడ్డారు.
ఇప్పుడు పెద్ది రిలీజ్ అయిపోయింది కనుక ఆమె పెట్టేబేడా సర్దేసుకొని హాయిగా ముంబయి ఫ్లైట్ ఎక్కేయవచ్చు. కానీ తిరుపతి ఫ్లైట్ ఎక్కారు.
పెద్ది సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆమె అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల చేరుకున్నారు. దారిలో మెట్లపై కూర్చొని భక్తులతో ఫోటోలు దిగారు. తిరుమల కొండపై మీడియా ప్రతినిధులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కనుక స్వామివారి దర్శనం తర్వాత వారితో నాలుగు ముక్కలు మాట్లాడుకోవచ్చు. తర్వాత?
పెద్ది లాంటి సినిమా చేసిన తర్వాత? అనే ఆలోచనే భయం కలిగిస్తుంది.
కానీ పెద్ది బ్యాటింగ్, కుస్తీ పట్లు అన్నీ బాగానే ఉన్నాయి కనుక హిట్ అవుతుంది. ఆ క్రెడిట్ జాన్వీ కపూర్ పద్దులో కూడా పడుతుంది. కనుక టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు తప్పక వస్తాయి.
రెండు హిందీ సినిమాలు ఎలాగూ చేతిలో ఉన్నాయి. అల్లు అర్జున్ ‘రాకా’లో ఆమె పేరున్నట్లు తెలుస్తోంది. అదొక్కటి తగిలితే చాలు. బహుశః అందుకే అన్ని మెట్లెక్కి శ్రీవారిని దర్శించుకున్నారా?




