కాళేశ్వరం: కేసీఆర్ ను ఏదరికి చేర్చనుందో.?

Kaleshwaram report impact

ఫోన్ టాపింగ్ కేసులతో కొన్నాళ్ళు తెలంగాణ రాజకీయాలు హడావుడి చేస్తే తాజాగా కాళేశ్వరం విచారణతో తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి.

ఒకపక్క కవిత వివాదంతో బిఆర్ఎస్ ఎటు తేల్చుకోలేని స్థితిలో కొట్టుకుంటుంటే, మరోపక్క కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ అంటూ కేసీఆర్, కేటీఆర్ ల చుట్టూ కేసులు వలయాలుగా ఏర్పడుతున్నాయి.

ADVERTISEMENT

ఇక కాళేశ్వరం అవినీతి మీద ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను వెల్లడించింది. నివేదిక ప్రకారం తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ సైట్ మార్చడంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి, నిజాయితీ లోపించిందని, బ్యారేజీల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తీసుకోలేదని, CWC, వాప్కోస్ నివేదికను పరిగణలోకి తీసుకోలేదంటూ నివేదించింది.

దీనితో నేడు జరగనున్న క్యాబినెట్ మీటింగ్ లో నివేదిక పై ఎటువంటి చర్చ జరగనుంది.? రేవంత్ సర్కార్ కేసీఆర్, హరీష్ లపై ఎటువంటి చర్యలకు ఆదేశాలను జారీ చేస్తుంది.? అనే ఆసక్తి తెలంగాణ రాజకీయాలలో మొదలైతే ఆందోళలన బిఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి వేరువేరుగా భేటీ అయ్యారు. కాళేశ్వరం నివేదిక పై ఎలా ముందుకెళ్లాలి, కవిత వివాదం తో పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చల సారాంశం ఏమిటి అనే విషయాల పై హరీష్ తో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు చేసారు.

పీసీ ఘోష్ నివేదిక బిఆర్ఎస్ కు ప్రతికూలంగా ఉండడంతో ఈ అంశాన్ని ప్రజా క్షేత్రంలోకి ఎలా తీసుకెళ్లాలి.? ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి కేసీఆర్ ఛండీయాగంతో అడుగు ముందుకేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఛండీయాగం నిర్వహించనున్నారు.

ADVERTISEMENT
Latest Stories