Kavita BRS

తెలంగాణ రాజకీయాలు కొంచెం కొంచెం గా ఆంధ్ర రాజకీయాలు మాదిరి మారిపోతున్నాయి. మొన్నటి వరకు కేవలం ప్రాంతీయ వాదం, తెలంగాణ నినాదం తో నడిచిన తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు కుల రాజకీయాలలో చిక్కుకున్నాయి.

తెలంగాణ రాజకీయాలలో బీసీ ల హక్కుల కోసం పోరాటం అంటూ తెలంగాణ లో కూడా కుల రాజకీయాలకు పునాదులేసారు కొందరు అవకాశవాద రాజకీయ వాదులు. ఇక ఇప్పుడు ఏపీలో బాగా ప్రాసిద్యం పొందిన విగ్రహ రాజకీయాలు కూడా తెలంగాణ లో పురుడు పోసుకుంటున్నాయి.

Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్నాళ్లుగా తెలంగాణ తల్లిగా ఉన్న విగ్రహ రూపురేఖలు మార్చుతూ తెలంగాణ సచివాలయంలో కొత్త రూపాన్ని ఆవిష్కరించారు. దీనితో అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ శ్రేణుల మధ్య పోటాపోటీగా విగ్రహ రాజకీయం కొనసాగింది.

అయితే ఇప్పుడు తెలంగాణలో మరో విగ్రహ రాజకీయానికి తెరలేపారు కేసీఆర్ కుమార్తె కవిత. అసెంబ్లీ ప్రాంగణంలో ‘జ్యోతిరావు పూలే’ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నారు కవిత. హైద్రాబాద్ లో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టిన కవిత, ఏప్రిల్ 11 న పూలే జయంతి సందర్భంగా జ్యోతి రావు విగ్రహ ఏర్పాటు పై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూల ప్రకటన ఇవ్వాలంటూ రేవంత్ సర్కార్ కు అల్టిమేటం జారీచేశారు.

Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?

అలాగే ప్రభుత్వం పూలే విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చే వరకు తన ఈ పోరాటం కొనసాగుతుందంటూ స్పష్టం చేసారు కవిత. అయితే గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో, ఎంపీ గా, ఎమ్మెల్సీ గా కవిత అనేక ప్రభుత్వ పదవులను చేపట్టారు. అయితే ఆ పదేళ్లలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు గురించి కనీసం ఆలోచన చెయ్యలేని కవిత ఇప్పుడు మాత్రం ఆయన విగ్రహ ఏర్పాటు కోసం ప్రభుత్వం తో పోరాటం చేయడాన్ని విగ్రహ రాజకీయం కాక మరేమంటారో.?

పూలే వంటి ఒక సామజిక సంఘ సంస్కర్త విగ్రహ ఏర్పాటు కోసం కవిత ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తో పోరాటం చేయడం తప్పు కాదు, కానీ తన చేతిలో దశాబ్దం పాటు అధికారాన్ని పెట్టుకుని ఇప్పుడొచ్చి పూలే కు విగ్రహం ఏర్పాటు చెయ్యాలి, ఆయనను గౌరవించాలి, ఆయన సేవలను గుర్తించాలి అంటూ సుద్ద పూస కబుర్లు చెప్పడమే కవిత పై విమర్శలకు తావిస్తుంది.

Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది, ఇక రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగేలేదు అంటూ బల్ల గుద్ది చెపుతున్న బిఆర్ఎస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే ఇదే పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా.? అందుకు ఎంత సమయం తీసుకుంటారు.? అంటే మాత్రం నీళ్లు నములుతారు.

రాజకీయ పార్టీల రాజకీయం చూస్తుంటే నేటి రాజకీయాలకు కాదేది అనర్హం అన్న చందంగా మారిపోతున్నాయి. ఆంధ్రాలో ఎన్నాళ్ళ నుంచో వెల్లూరుకుపోయిన కుల రాజకీయాలు, విగ్రహ రాజకీయాలు నేడు తెలంగాణ లో అడుగుపెట్టాయి, ఇక ఏపీలో వైసీపీ ఆస్థాన రాజకీయమైన శవ రాజకీయాలు ఒక్కటే ఇంకా తెలంగాణలో పాదం మోపలేదేమో.




ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఇక అతి త్వరలో వైసీపీ బ్రాండ్ అయిన ఈ శవ రాజకీయాలు కూడా తెలంగాణ సమాజాన్ని, అక్కడి రాజకీయాన్ని భ్రష్టు పట్టించడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఆ రాజకీయాలను తెలంగాణకు ఆహ్వానించే రాజకీయ పార్టీ ఎదన్నది కాలమే సమాధానం చెప్పాలి.