కవిత అవమాన భారం…బిఆర్ఎస్ మౌనరాగం..?

Kalvakuntla Kavitha Insulted, But BRS Silent?

తెలుగు రాష్ట్ర రాజకీయాలు నానాటికి ఒక్కో మెట్టు కిందకు దిగుతూ తెలుగు జాతికే అవమానంగా మారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కొంతమంది రాజకీయ ముసుగు వేసుకున్న నాయకులు ఆ ముసుగులో తన అనుచరగణాన్ని ఉత్సాహపరచడానికో, వారిలో ఉత్తేజం నింపడానికో దిగజారి ప్రవరిస్తున్నారు.

ఇందుకు రాజకీయాలతో సంబంధం లేని మహిళలను రాజకీయ వేదికలెక్కిస్తున్నారు, రాజకీయాలలో మహిళా నేతలుగా ఎదిగిన నాయకురాళ్లను నీచమైన వ్యాఖ్యలతో కిందకు లాగుతున్నారు. మహిళల ఆత్మ గౌరవం దెబ్బతినేలా ఇటువంటి రాజకీయ విమర్శలు చేస్తూ తమను తాము తగ్గించుకుంటూ తమ పార్టీ స్థాయిని కూడా పాతాళానికి పడేస్తున్నారు ఈ ప్రబుద్ధులు.

ADVERTISEMENT

ఇటువంటి రాజకీయాలకు పుట్టినిల్లు ఏపీ లోని వైసీపీ పార్టీ అని చెప్పడంలో ఎవ్వరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. నాడు నారా భువనేశ్వరి నుంచి నేడు ప్రశాంతి రెడ్డి వరకు, పవన్ సతీమణి నుంచి వైస్ షర్మిల వరకు…వీరంతా వైసీపీ నాయకుల నీచ రాజకీయానికి బాధితులుగా మారి అవమాన భారాన్ని మోసినవారే.

ఇక ఇప్పుడు ఈ జాడ్యం తెలంగాణ రాజకీయాలను తాకింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసారు.

మహిళలను గౌరవించే సంస్కృతి నుంచి తెలుగు రాజకీయాలు మహిళలను కించపరిచే స్థాయికి దిగజారుతున్నాయి అని చెప్పడానికి తీన్మార్ వ్యాఖ్యలు కూడా నిదర్శనంగా చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు 42 % రిజ్వేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని కవిత తన విజయంగా, జాగృతి పోరాటంగా ప్రకటించుకున్నారు.

ఈ ప్రకటనే తీన్మార్ అనుచిత వ్యాఖ్యలకు భీజం వేసింది. బీసీలకు కవితకు ఎం సంబంధం.? కవిత బీసీ రిజర్వేషన్ల కోసం తీహార్ జైల్ నుంచి పోరాటం చేసిందా.? అంటూ మొదలు పెట్టిన తీన్మార్ అద్దులు దాటి విమర్శలకు దిగారు. దానితో కవిత అనుచరులకు బీపీలొచ్చి తీన్మార్ ఆఫీస్ మీద దాడికి యత్నించారు.

అక్కడ తీన్మార్ సిబ్బంది కూడా కవిత అనుచరుల మీద గన్ తో దాడికి దిగారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కవిత కు తీన్మార్ వ్యాఖ్యలతో అవమానం జరిగిన మాట వాస్తవం. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి అడ్డుపడుచుకు ఇంతటి అవమాన భారం ఎదురైనప్పటికి బిఆర్ఎస్ మౌన రంగంలోనే ఉండిపోయింది.

తీన్మార్ మల్లన్న కవిత ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల ప్రత్యర్థి పార్టీ నాయకులైన కాంగ్రెస్ వారు సైతం తీన్మార్ చర్యలను తప్పుబట్టారు. కానీ సొంత పార్టీ మహిళా నేత మీద ఇటువంటి దుస్సాహసానికి పాల్పడిన మల్లన్న మీద బిఆర్ఎస్ మాత్రం మౌనంగానే ఉండిపోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇటు పార్టీ నాయకులు కానీ బిఆర్ఎస్ సోషల్ మీడియా కానీ కవిత కు మద్దతు తెలపలేదు, తీన్మార్ వ్యాఖ్యలను ఖండించలేదు. అలాగే అటు తండ్రి కేసీఆర్ కానీ ఇటు అన్న కేటీఆర్ కానీ తమ ఇంటి ఆడబిడ్డ పై ఇటువంటి నీచ వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై ఎటువంటి ఎదురుదాడి చెయ్యలేదు.
నాడు కవిత అరెస్టు పట్ల అవసరమైనంత మేర బిఆర్ఎస్ స్పందించలేదు అన్న ఆరోపణలు ఎదుర్కొంది. అలాగే నేడు కవిత పై మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో అసలు బిఆర్ఎస్ నుంచి స్పందనే కరువయ్యింది. దీనితో బిఆర్ఎస్ కు కవిత కు మధ్య రోజురోజుకి దూరం పెరుగుతుంది అనేది స్పష్టమవుతుంది.
దీనితో రాజకీయం రక్త సంబంధాలను కూడా రాజీ లేకుండా ముక్కలు చేయగలవు అని ఈ సంఘటనతో మరోమారు రుజువు చేసింది. బిఆర్ఎస్ నాయకత్వం పట్ల కవిత వినిపిస్తున్న వైతిరేఖ స్వరానికి గాను నేడు బిఆర్ఎస్ కవిత కు జరిగిన అవమానానికి గళం విప్పలేకపోయిందా.? గులాబీ బాసు కవితను పొమ్మలేనలేక పొగ పెడుతున్నారా.? అందుకే ఈ ఘటన పట్ల గులాబీ దండు గమ్మున ఉండిపోయిందా.? అన్న అనేక ప్రశ్నలు బిఆర్ఎస్ గుమ్మం ముందు జవాబు కోసం ఎదురు చూస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories